తెలుగువారికి వైయస్ జగ‌న్ ఉగాది శుభాకాంక్షలు

‌హైదరాబాద్, 30 మార్చి  2014:

రాష్ట్ర ప్రజలు, దేశ, విదేశాల్లోని తెలుగువారికి వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి శ్రీ జయ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు వర్ధిల్లాలని, రైతులు, పల్లెలు కళకళలాడాలని, తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, అందరూ ఐక్యంగా ఉండాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

కొత్త సంవత్సరంలో రాష్ట్రం, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని, పారిశ్రామిక ప్రగతి సాధించాలని, అన్న వృత్తులూ పరిఢవిల్లాలని, సంక్షభాలు తొలగిపోవాలని శ్రీ జగన్‌ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

Back to Top