ప్రతి ఓటును తనిఖీ చేయండి

 ట్విటర్‌ వేదికగా పార్టీ క్యాడర్‌కు వైయ‌స్‌ జగన్ దిశానిర్ధేశం
 

 
 హైదరాబాద్‌ : ఎన్నికల తుదిసమరానికి సిద్దం కావాలని  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా పార్టీ కార్యకర్తలకు, బూత్‌ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ బూత్‌ లెవల్‌ క్యాడర్‌ అందరికీ.. మనం నాలుగేళ్లుగా ప్రతి అంశంలో కష్టపడ్డాం. ఈ చివరి యత్నంలో ఉత్తమ ప్రయత్నాల కోసం పోరాడేందుకు ప్రతి ఒక్క వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సిద్దంగా ఉండాలి. వచ్చే రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయండి. పోలింగ్‌ రోజు ప్రతి ఒక్కరు ఓటేసేలా చూడాలి. వచ్చే 27 రోజుల్లో మీ నుంచి మద్దతును మరింత కోరుతున్నా’ అని వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి రేపటి(శుక్రవారం)తో గడువు ముగుస్తుండటంతో పార్టీ క్యాడర్‌ను వైయ‌స్‌ జగన్‌ అలర్ట్‌ చేశారు. 

Back to Top