మల్లాది సుబ్బమ్మ మృతికి జగన్‌ సంతాపం

హైదరాబాద్, 15 మే 2014:

ప్రముఖ సంఘ సేవకురాలు, స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మృతికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. సారా నియంత్రణ మహోద్యమంలో నిజాయితీగా పోరాడిన నాయకురాలు, మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు సుబ్బమ్మ శ్రమించారని ఆయన నివాళులు అర్పించారు. తాను నమ్మిన సిద్ధాంతాలు, ఆదర్శాల కోసం సుబ్బమ్మ తన జీవితాంతమూ మొక్కవోని దీక్షతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. శ్రీమతి సుబ్బమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రార్థించారు.

Back to Top