రైతుల తరపున పోరాటం..!

  • రైతులకు బీమా సొమ్ము ఇచ్చేందుకు కుంటిసాకులు
  • సాంకేతిక కారణాల  తో నిరాకరణ
  • బీమా కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
  • సంఘీభావం తెలిపిన వైఎస్ జగన్

  • హైదరాబాద్: బీమా సంస్థల నుంచి డబ్బులు రాని రైతుల తరపున పోరాడుతామని ప్రతిపక్ష
    నేత వైఎస్ జగన్ వెల్లడించారు. 2012..13 ఆర్థిక సంవత్సరానికి గాను బీమా సొమ్ము
    పొందని రైతుల ప్రత్యక్ష పోరాటానికి ఆయన మద్దతు పలికారు. హైదరాబాద్ లోని
    ఇన్సూరెన్స్ సంస్థల ప్రధాన కార్యాలయం దగ్గర వైఎస్సార్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు.
    పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులతో బీమా కార్యాలయం నిండిపోయింది. రైతులకు మద్దతుగా
    వైఎస్ జగన్ అక్కడకు చేరుకొన్నారు. రైతుల తరపున అధికారులతో మాట్లాడారు. అనంతరం
    ఉన్నతాధికారులతో రైతులకు హామీ ఇప్పించారు.

          2012..13 వ ఆర్థిక సంవత్సరానికి
    గాను 55వేల మంది పంట బీమా కోసం దరఖాస్తు చేసుకొన్నట్లు వైఎస్ జగన్ చెప్పారు.
    ఇందులో 29వేల మందికి బీమా శాంక్షన్ చేసి, మిగిలిన 26వేల మందికి ఎగ్గొట్టినట్లు
    వివరించారు. ఇచ్చిన 29వేల మంది కి రూ. 135 కోట్లు విడుదల చేసినా, రూ. 105 కోట్ల
    మాత్రమే రైతులకు చేరింది. మిగిలిన సొమ్ము ను పెండింగ్ లోనే పెట్టారు. మిగిలిన
    26వేల మందికి ఎందుకు అందలేదని అడిగితే సాకులు చెబుతున్నారని వైఎస్ జగన్ ఆవేదన
    వ్యక్తం చేశారు. దరఖాస్తులో సరైన వివరాలు అందలేదు కాబట్టి వాటిని తిరస్కరించారని
    ఆయన వివరించారు. దరఖాస్తులు సక్రమంగా లేకపోతే 2,3 నెలల్లో చెబితే వివరాలు
    అందించటానికి వీలవుతుందని, మూడేళ్ల దాకా మాట్లాడకుండా ఊరుకొని ఇప్పుడు సాకులు
    చెబితే ఎలా అని ప్రశ్నించారు.


          రైతుల ఆవేదనను ఇప్పటికే అసెంబ్లీలో
    ప్రస్తావించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. అందుచేత రైతుల
    పక్షాన నిలిచి ఆదుకోవాలని బీమా సంస్థల ఉన్నతాధికారుల్ని ఆయన కోరారు. దీని మీద
    అక్కడే ఉన్న ఇన్సూరెన్స్ సంస్థ ఉన్నతాధికారులతో రైతుల్ని నేరుగా మాట్లాడించారు.
    గతంలో వ్యవసాయ శాఖ నుంచి తమకు దరఖాస్తులు వచ్చేవని, అందువల్ల సమస్య తలెత్తిందని,
    త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఇందుకు నెల రోజులు గడువు
    పెట్టుకోవాలని, అప్పటిలోగా పరిష్కరించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పోరాటానికి
    మద్దతుగా నిలిచిన వైఎస్ జగన్ కు రైతులు ధన్యవాదాలు తెలిపారు.

     

Back to Top