విమర్శలు మాని సమాధానం చెప్పండి..!

రైతులు,పేదల పొట్టగొట్టి రాజధాని నిర్మాణమా..!
తాత్కాలిక ఫ్రభుత్వం అవినీతి బాగోతం..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నేత పార్థసారథి టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  రైతులు, పేదలను మోసం చేసి బలవంతంగా భూములు లాక్కొని కడుతున్న రాజధానికి తాము రాలేమన్నారు. ఎందుకు రాలేమో తమ అధినేత వైఎస్ జగన్ సహేతుకంగా కారణాలు కూడా వివరించామని చెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకొని వైఎస్సార్సీపీని విమర్శించడమే పనిగా మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు అమరావతిని నిర్మిస్తున్నారా లేక భ్రమరావతిని నిర్మిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వ్యక్తిగతంగా నిర్మించే రాజధాని కోసం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని పార్థసారథి ప్రభుత్వంపై ఫైరయ్యారు.

అంతా అవినీతే..!
నీరు మనచెట్టు కోసం జిల్లాకు 39 కోట్లు, వీఐపీలకు హెలికాప్టర్, పార్కింగ్ లకు 150 కోట్లు, స్టార్ హోటల్స్ లో బసకోసం  10 కోట్లు, భోజనాలకు 2న్నర కోట్లు ,  టెంపరరీ రోడ్ల కోసం 33 కోట్లు, శంకుస్థాపన పేరుతో రూ.400 కోట్లు  ఇలా దుబారా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాన్నారని మండిపడ్డారు. తాత్కాలిక పట్టిసీమకు 1600కోట్లు, తాత్కాలిక అసెంబ్లీకి 1200 కోట్లు అంటారు.  అసలు ఇది  తాత్కాలిక ప్రభుత్వమేమో అన్న అనుమానం కలుగుతుందని పార్థసారథి ఎద్దేవా చేశారు. తాత్కాలికం పేరు మీద ముడుపులు పోగుచేసుకుంటూ రాష్ట్రాభివృద్దికి అడ్డుపడుతుంది తెలుగుదేశం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాకు ఎందుకు అడ్డుపడుతున్నారు. కేంద్రం మీద ఎందుకు పోరాడడం లేదని నిలదీశారు. 

కుటుంబ వ్యవహారంలా చేస్తారా..?
భూసేకరణ ఆర్డినెన్స్ పై ప్రధానమంత్రే వెనక్కి తగ్గారని పార్థసారథి తెలిపారు. అలాంటిది దేశంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు బిల్లును అడ్డుపెట్టుకొని రైతు మెడల మీద కత్తి పెట్టి..బలవంతంగా భూములు సేకరించారన్నారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, 144లు  పెట్టి కేసులు పెడతామని బెదిరించి భూములు లాక్కున్నారన్నారు. రైతులు, పేదలకు అన్యాయం చేయొద్దన్నదే తమ భావన అని పార్థసారథి  స్పష్టం చేశారు. హోదా ఇచ్చినా, విభజన చట్టం అమలు చేసినా రాష్ట్రం మెరుగపడుద్దని... అలా ఐతే, సింగపూర్ కంపెనీలతో వ్యాపారం చేయడం వీలుకాదనే చంద్రబాబు అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. రాజధాని నిర్మాణం కుటుంబ వ్యవహారంలా, పార్టీ వ్యవహారంలా ఒంటెద్దుపోకడలకు పోతున్నారని ధ్వజమెత్తారు.
Back to Top