విఎస్‌ రమాదేవి మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్, 17 ఏప్రిల్‌ 2013: ‌మాజీ గవర్నర్‌ వి.ఎస్. రమాదేవి మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. మొట్టమొదటి భారత మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా, కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌గా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు ఉన్నత పదవులు నిర్వహించిన రమాదేవి సారస్వత రంగంలోనూ రాణించిన బహుముఖ ప్రజ్ఞశాలి అని శ్రీమతి విజయమ్మ నివాళులు ఆర్పించారు.

ఏ పదవిలో ఉన్నా రమాదేవి ఆడంబరాను దూరంగా పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండేవారని, విమర్శలకు తావివ్వకుండా హుందాగా పదవిని నిర్వహించారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. ప్రజాహిత పరిపాలనా వ్యవస్థకు సంబంధించి వి.ఎస్. రమాదేఇ లేని లోటు తీర్చలేనిదని ఆమె వ్యాఖ్యానించారు. వి.ఎస్. రమాదేవి కుటుంబ సభ్యులకు శ్రీమతి విజయమ్మ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Back to Top