తుపాన్ సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొనండి

హైదరాబాద్, 12 అక్టోబర్ 2013:

పై‌ లిన్ తుపాన్ తో అతలాకుతలం అవుతున్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొనేనా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆయా జిల్లాల పార్టీ ఇన్‌చార్జిలను ఆదేశించారు. తుపాన్ బాధిత‌ ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. పై లిన్‌ తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పార్టీ నాయకులకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ఫోన్లు చేశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నెల రోజుల్లోనే రెండు సార్లు నిరవధిక నిరాహార దీక్ష చేసిన శ్రీ జగన్‌ ఆరోగ్యం బాగా దెబ్బతిన్న కారణంగా కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిమ్సు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే నిమ్సు ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన పై లిన్‌ తుపాను ప్రభావం రాష్ట్రంలోని లక్షలాది మందిపై పడుతుందన్న వార్తలతో కలత చెందారు. దీనితో ఈ ఉదయం నుంచే ఆయన ఆయా జిల్లాల ఇన్‌చార్జిలతో ఫోన్‌లో మాట్లాడారు. ధర్మాన కృష్ణదాసు (శ్రీకాకుళం), పెన్మత్స సాంబశివరాజు, సుజయ కృష్ణ రంగారావు (విజయనగరం), కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివిస్ (విశాఖపట్నం), టి. బాలరాజు (పశ్చిమ గోదావరి), కుడుపూడి చిట్టబ్బాయి (తూర్పు గోదావరి)లతో శ్రీ జగన్‌ మాట్లారు.

కాగా, పై లిన్‌ ప్రభావిత జిల్లాల నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, నాయకులతో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ కూడా ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్కారు.

Back to Top