బంగారు లక్ష్మణ్‌ మృతికి జగన్‌ సంతాపం

హైదరాబాద్, 1 మార్చి 2014:

భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్‌ మృతి పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. పేద దళిత కుటుంబంలో జన్మించని లక్ష్మణ్‌ స్వశక్తితో ఉన్నత చదువులు చదివారని, అతి చిన్న వయస్సులోనే క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించి, జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. ఎమెర్జీకి వ్యతిరేకంగా పోరాడిన యోధులు బంగారు లక్ష్మణ్‌ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో నిర్బంధంలో ఉన్న అనేక మంది పెద్ద నేతలలో ఆయన ఒకరని గుర్తుచేసుకున్నారు. బంగారు లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులకు శ్రీ జగన్‌ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

Back to Top