శ్రీమతి విజయమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్, 12 జనవరి 2013: సంక్రాంతి పర్వదినం సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాడి పంటల ప్రాధాన్యానికి సంకేతమైన ఈ పల్లెల పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. ప్రత్యేకించి రైతన్నలు, రైతు కూలీలకు మరింతగా మంచి జరగాలని శ్రీమతి విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణగా పేరు గాంచిన తెలుగునేల పాడి, పంటలకు నెలవు కావాలని శ్రీమతి విజయమ్మ శనివారం విడుదల చేసిన శుభాకాంక్షల ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. రైతన్నకు అండగా నిలచి వ్యవసాయాన్ని పండుగ చేసే విధానాలకు జయం కలగాలని శ్రీమతి విజయమ్మ అభిలషించారు.
Back to Top