స్పీకర్‌: శ్రీమతి రోజా - మే 26,2012

ఈ రాష్ట్ర ప్రభుత్వంకు  ప్రజా సమస్యలమీద రాష్ట్ర అభివృద్ది మీద చిత్తశుద్ది లేదు.కాని జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద కుట్రలు పన్నడంలో మాత్రం క్యాబినెట్‌ మాత్రం ఒకే తాటిమీద నడుస్తుంది. ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ మూడు సంవత్సరాలకాలంలో ప్రజాసమస్యలు అయిన మిర్చి రైతులు,పసుపు రైతులు, కొన్ని చోట్ల రైతులు  క్రాఫ్‌ హలిడే ప్రకటించే పరిస్ధితి వచ్చింది. రైతులకోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు మళ్ళి తిరిగి పోటిచేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు సీనియర్‌ మంత్రి అయివుండి రెస్సాన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారు  మంత్రులు రాజశేఖరరెడ్డి గారు బలవంతంగా సైన్‌ పెట్టించారు అని అంటున్నారు.మేము ఒకటే అడుగుతున్నాం రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన ఈ మూడు సంవత్సరాలలో కాలంలో అయిన మీరు కిరణ్‌కుమార్‌ రెడ్డిగారికి అనుగుణంగా సంతకాలు పెట్టారా లేదా మీ మనసాక్షికి అనుగుణంగ ఆసంతకాలు పెట్టారా తెలియాల్చిఉంది. తప్పు జరిగిఉంటే మీరు కూడ ఇరుక్కుంటారు అని తెలిసినప్పుడు ఎందుకు సంతకాలు పెట్టారు అనేది మా మోదటి ప్రశ్న....రెండవది కిరణ్‌కుమార్‌ రెడ్డి గారి బలవంతం మీదే ఈరోజు సీబీఐ ఎంక్యరి నడుస్తుంది అనేది తెలుస్తుంది.ఫ్రింటెడ్‌ పేపర్‌ తీసుకుని అతని దగ్గర రాజీనామా తీసుకొవడం మనం చానల్స్‌లో చూచాం. ఈరోజు కాంగ్రెస్‌ వాళ్ళు ఏ సంక్షేమ పధకం ప్రవేశ పెట్టిన అది సోనియా గాంధీ గోప్పతనం అని అంటున్నారు సోనియా గాందీ చెప్పందే రాష్ట్రంలో చీమ కూడ కదలదు అని చెబుతున్నా కాంగ్రెస్‌ వాళ్ళు రాజశేఖరరెడ్డి  కూడ సోనియాగాంధీ చెప్పినట్టు చెసారు అనుకోవచ్చుకదా..జగన్‌మోహన్‌్‌రెడ్డి దోషికాదు జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు జగన్‌మోహన్‌రెడ్డిని  అరెస్ట్‌చేసే పరిస్ధితులు లేవు. ప్రజలకు తెలుసు వేదింపులుకు గురిచేస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డిగారిని..సుప్రీంకోర్టు అడిగింది వివాదస్పదమైన 26 జీఒలు దీని గురించి మంత్రులు ఏమైన చెప్పాలనుకుంటున్నారా అని, ఒక జీఒల మీద హైకోర్టు స్పందించినప్పుడు ప్రభుత్వం చెప్పాలి తప్పు  జరిగిందాలేదా అని 26 జీఒల్లో తప్పులు జరుగలేదు అని చెప్పాలి.అలా చెబితే జగన్‌మోహన్‌రెడ్డిని బలిపశువును చేయలేమని రాజకీయంగా నాశనం చేయలేమని ఆ రోజు సైలెంట్‌గాఉన్నారా .. అదైన చెప్పండి. సుప్రీంకోర్టులో ఫిటిషన్‌ వేసిన తర్వాత సుప్రీంకోర్టు క్లియర్‌గా చెప్పింది.ఏప్రిల్‌ 31 లోపల మంత్రులని సంబందింత అధికారులని అందరిని విచారించి నివేదిక ఇమ్మని.మరి 31వ తేది వరకు కూడ ఏ తప్పు జరగలేదు అన్నాళ్ళు అత్యవసరంగా క్యాబినెట్‌ సమావేశం ఎర్పాటు చేసి కిరణ్‌గారి నేతృత్వంలో ఒక మంత్రిని బలిపశువుని చేసి అతిని చేత బలవంతంగా సైన్స్‌ పెట్టించి జగన్‌మోహన్‌రెడ్డి కేసులో ఇరికించాలిఅని అనుకుంటున్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌కి తెలుగుదేశంకి పతనం ప్రారంబంఅయింది కాబట్టి దాన్ని తప్పించుకోడానికి రాష్ట్రంలో సమస్యలు పక్కనబెట్టి జగన్‌మోహన్‌రెడ్డిగారిని ఇష్యూచేసుకుంటు దోషిదోషి అంటే అదినిజమైవుతుంది అని ముందుకువెళుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి దోషి అనడానికి మీదగ్గర అధారాలున్నాయా...జగన్‌మోహన్‌రెడ్డి గారు మీద జరుగుతున్న దాడులకు చలించి మైసూరరెడ్డిగారు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు అందుకు తెలుగుదేశం మైసూరారెడ్డి గారి మీద దిగజారుడు వ్యాక్యలు చేస్తున్నారు.రాజశేఖరరెడ్డిగారు బలవంతంగా సంతాకాలు పెట్టించారు అంటున్న మంత్రులు రాజశేఖరరెడ్డి గంగలో దూకమంటే దూకుతారా.మంత్రులు ఆలోచించి పని చేస్తారుగా.. జగన్‌మోహన్‌ రెడ్డి అధికార దాహంతో ఎన్నికలు వచ్చాయని చిరంజీవి అంటున్నారు. చిరంజీవి అధికార  దాహనికి తిరుపతి ఎన్నికలు రాలేదా....చిరంజీవి పేరు వింటేనే జనం నవ్వుకుంటున్నారు. లగడపాటి  ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికి తెలియదు లగడపాటిని మూడు ప్రాంతాల ప్రజలు నమ్మడంలేదు..........

Back to Top