స్పీకర్ : నల్లా సూర్యప్రకాశ్ - ఏప్రిల్ 10, 2012

శ్రీ యం. నాగార్జున గారు మాట్లాడుతూ భారతదేశ రాజకీయ వ్యవస్తలో ఆంధ్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎస్‌.సి., ఎస్‌.టి 
బి‌.సి, మైనార్టీలకు ఈ సంక్షేమ పధకాలు అందడం వల్ల రాజశేకర రెడ్డి గారిని ప్రజలు దేవునిగా కొలుచుకుంటున్నారు. వారు చనిపోయిన తర్వాత ప్రజా సంక్షేమాలు కుంటుబడినాయి. వాటి గురించి ప్రతిపక్షం నోరు మూసుకొని ఉంది, ఆదికర పక్షం పనిచేయడం లేదు. ఈ రోజు స్థాయి మరచి కొండ్రు మురళి రాజశేఖర రెడ్డి గారి గురించి 
మాట్లాడుతున్నారు. ఎస్‌.సి, ఎస్‌.టి నాయకులకు లక్షల ఎకరాలు పంపిణీ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు . 

పదవుల,ఆస్తుల కోసం రాజశేఖర రెడ్డి గారిని తిట్టడానికి ఈ రోజు దళిత దళారులు అయిన హర్షకుమార్,జే‌.డి శీలం, కొండ్రు మురళి, పూనుకున్నారు. రాజశేఖర్ గారిని టిడితే 
రాష్ట్ర ప్రజలు మీకు బుద్ది చెపుతారు. అంబేద్కర్ గారి పేరు మీద 10 ఎకరాలు కాలేజీ కోసం ప్రభుత్వ భూమిని తీసుకొని స్వంతానికి వాడుకున్న వ్యక్తి కొండ్రు మురళీ. దమ్మున్న మగాడివైతే నీ నియోజకవర్గంలో పల్లెలో తిరగ గలవ కొండ్రు మురళి అని అడుగుతున్నం. దళితులు తమ పల్లెలో కష్టపడి సంపాదించిన డబ్బుతో రాజశేకర రెడ్డి 
గారి విగ్రహాలు పెట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో దళితుల ఆరాద్య దైవ్యంగా జగన్మోహనరెడ్డి గారు కొనియాడబడతారు. నల్లా సూర్యప్రకాశ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ 
నాయకులు జే‌.డి శీలం గారు మాట్లాడుతూ దళితులకు కేటాయించిన నిదులు పక్కదారి పట్టాయి అని రాజశేఖర రెడ్డి గారికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 48 లక్షల ఇల్లు కేటాయిస్తే అందులో సింహ భాగం దళితులకే కేటాయించారు. జే‌.డి శీలం గారు తన జీవితం అంతా కర్నాటకలో పని చేసిన 
వ్యక్తి, ఆయన మీద విచారణలు జరిగి దోషిగా నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. దళితులు అంతా వైఎస్ఆర్ పార్టీ వైపు చేరితే 
కాంగ్రెస్ వారు బెంబేలెత్తి హర్ష కుమార్,జే‌డి శీలం,కొండ్రు మురళి లాంటి వ్యక్తులను ఉసిగొల్పుతుంది. వై. ఎస్  గారి హయాంలో 80 లక్షల సామాజిక పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఎస్‌.సి కార్పోరేషన్ నుంచి 11 వందల 20 కోట్ల రూపాయల మార్జిన్ మనీ ఇవ్వడం జరిగింది. ఇవి పూర్తిగా రాజశేకర్ రెడ్డి గారు మాఫీ చేయడం జరిగింది. దళితులకు సంబందించి 10 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ 2000,2001 నాటికి 532కోట్లు కేటాయిస్తే అది  దిగిపోయేనాటికి 807 కోట్లుగా ఉంది.
అదే రాజశేఖర్ గారి హయాంలో 2004,2005లో 2 వేల 500 ల కోట్లు కేటాయించడం జరిగింది 2007,2008 కల్ల 1719 కోట్లు కేటాయించడం జరిగింది. ఇన్ని సంక్షేమాలు 
చేసిన నిదులు పక్క దారి పడుతున్నాయని ఏ రకంగా చెబుతున్నారు. అమలాపురం అంబేద్కర్ విగ్రహాలు కూలగొట్టిన సంగటనలో హర్షకుమార్ హస్తం ఉందని పోలీసులు 
నిర్దారించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆ సంఘటన నివేదిక బయట పెట్టాలి.

తాజా వీడియోలు

Back to Top