స్పీకర్ : వాసిరెడ్డి పద్మ-మార్చి23,2012

ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు 4వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపడానికి రంగం సిద్దం చేసుకుంటుంది అని పత్రికల్లో చూస్తున్నాం. దాదాపు అన్ని ధరలు పెరిగిపోయి సాధారణమానవుడు బ్రతికే పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో కరెంట్ చార్జీలు పెంచాలని చూడడం దారుణం.
ఎన్నికల్లో మీ పార్టీని ప్రజలు ఓడించిన మీరు కళ్ళు తెరవకపోతే ఎలా అని అడుగుతున్నాం. సాధారణ వినియోగాదారులమీద 900కోట్లు. వాణిజ్య సంస్థల పరిశ్రమల మీద 3100 కోట్లు భారంవేయడానికి సిద్దపడ్డారు. ఇది ప్రజావ్యతిరేఖ చర్యగా మేము భావిస్తూ ఈ చర్యల్ని వెనక్కి తీసుకోవాలని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ  తరుపున డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తున్నా ప్రతిపక్ష పార్టీ మాత్రం వారికే వత్తాసు పలుకుతుంది. ప్రజావ్యతిరేఖ విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షపార్టీగా ప్రజాసమస్యలపై నిలదీయడానికి వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఉందని గుర్తుచేస్తున్నాం. కాంగ్రెస్ టి.డి.పి. పార్టీలకు ప్రజలు ఎంత వ్యతిరేఖంగా ఉన్నారో 7 ఉపఎన్నికల ద్వారా తెలియచేసారు.
రాజకీయాలలో మార్పు రావాలని కోవూరు ప్రజలు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీని అత్యదిక మెజారిటీతో గెలిపించారు. కోవూరులో జరిగిన ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పుతాయి. ప్రజాసమస్యలు పట్టని జీవచ్ఛవాలుగా కాంగ్రెస్ టి.డి.పి. పార్టీలు తయారయ్యాయి. పంచాగ శ్రవణం చెప్పించుకొని అంతా బావుంది అనుకుని కాలం గడపడంకాదు. ప్రజాసమస్యలపై పోరాడాలి. నాయకుడు అనే వాడు ప్రజల మద్యలో ఉండాలి వారి కష్టనష్టాలు తెలుచుకోవాలి అందుకే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటున్నారు.

తాజా ఫోటోలు

Back to Top