స్పీకర్ : నల్లా సూర్యప్రకాశ్ -మార్చి24,2012

దళితుల, ఆదివాసీల ఉప ప్రణాళిక పటిస్తంగా అమలు జరగాలంటే చట్టం ఏర్పాటు చేయడం మినహా మరో మార్గం లేదని వైఎస్ఆర్ పార్టీ పాలక మండలి సబ్యులు, మాజీ మంత్రి శ్రీ మూలింటీ మారెప్ప అన్నారు.

దళితులు ఆదివాసీల ఉపప్రణాళిక అమలు కోసం 72 గంటల దీక్ష సందర్బంగా వైఎస్ఆర్ పార్టీ దళిత విభాగం గ్రేటర్ హైద్రాబాద్ కన్వీనర్ 
రవి కుమార్ పార్టీ స్టీరింగ్ కమిటీ మెంబర్ నీలం రాజు  ఈ దీక్షలో 72 గంటల పాటు పాల్గొంటారు.

ఈ సందర్బంగా శ్రీ మారెప్ప గారు మాట్లాడుతూ మనిషి యొక్క కనీస అవసరాలైన కూడు,గుడ్డ, నీడ, వైద్యం వీటి మీదనే శ్రీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రదానంగా ద్ర్యుష్టి కేంద్రీకరించారు. దేశమంతా 48 లక్షల గృహాలు నిర్మిస్తే ఒక్క ఏ. పి లోనే 47 లక్షల గృహాలు కట్టించారు. సామాన్యుడు కూడా కార్పోరేట్ వైద్యం పొందడానికి రాజీవ్ ఆరోగ్య శ్రీ ప్రారంబించారు. ఎక్కడైనా ఎపుడైనా ప్రమాదం జరిగినపుడు 
104,108 అంబులేన్సులు రాష్ట్రమంతటా సమకూర్చారు. దురదృస్టావశాత్తు  ప్రజలకు అందుబాటులో లేకుండా మూలాన పడాల్సిన పరిస్తితి. ప్రతి యొక్క అర్హుడైన విద్యార్దికి ఫీజురీఎంబుర్సెమెంట్ ద్వారా డాక్టర్లు,ఇంజనీర్లు అయ్యే అవకాశం కలిపించారు.

విద్యా ద్వారానే దళిత సమాజం అబివృద్ది జరుగుతుంది. ఈ కిరణ్ ప్రబుత్వమ్ దళితుల సమాజం అబివృద్ది చెందకుండా కుట్ర పన్ను తుంది. అన్నీ రకాల దరలు పెంచడం ద్వారా సామాన్యుడి నడ్డి విరుస్తుంది. మా పార్టీ ఆదినాయకుడు శ్రీ జగన్ గారు దళితుల అబివృద్దికి ప్రతీక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి హామీ ఇచ్చారు. మాటకు కట్టుబడే వై. ఎస్  కుటుంబం ఎప్పుడు అదికారాన్ని చేపట్టిన దళితులకు ప్రత్యేక 
బడ్జెట్ పెట్టె అవకాశం ఉంటుంది.

విదాన సభలో విదాన పరిషత్ లో దళితులకు సంబందించిన చర్చ జార్గపోవడానికి ముక్య కారణం ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి. ప్రదాన ప్రతిపక్షనికి ఏ మాత్రం దళితులపైన గౌరవం ఉన్న తక్షణమే అసెంబ్లీ లో చర్చ జరపడానికి చొరవ చూపాలని శ్రీ మారెప్ప గారు డిమాండ్ చేశారు.

ఈ దీక్ష సమావేశంలో దళిత విబాగం రాష్ట్ర కన్వీనర్ శ్రీ నల్ల సూర్య ప్రకాష్, మహిళా విబాగం కన్వీనర్ శ్రీమతి కొల్లి నిర్మలా కుమారి మరియు వందలాది మంధి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ మాజీ ప్రదాన కార్యదర్శి కాకి మాధవరావు అద్యక్షత వహించగ బి‌జే‌పి అద్యక్షుడు కిషనరెడ్డి,దత్తాత్రేయ తెలుగు 
దేశం నాయకుడు మోతుకుపల్లి నరసింహులు,ఎం‌ఎల్‌సి శ్రీ చుక్కా రామయ్య గారు,సాక్షి చానల్ ఎడిటర్ దిలీప్ రెడ్డి,హెచ్‌ఎం‌టి‌వి ఎడిటర్ రామచంద్రమూర్తి,జర్నలిస్టు సంఘాల నాయకులు శ్రీనివాస్రెడ్డి,దేవరాపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు .

Back to Top