స్పీకర్ : గట్టు రామచంద్రరావు -మార్చి26,2012

జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టని తగ్గించడానికి ఈ రోజు చంద్రబాబు విలేఖరుల సమావేశం లో జగన్ మోహన్ రెడ్డి అవనీతిపరుదని శవరాజకీయాలు చేశాడని చెప్తున్నాడు. రాజకీయాలను శవాలు చేసి ఎన్‌టి రామారావు దగ్గర పిల్లిలా చేరి ఆయన పదవిని,పార్టీని,కుటుంబాన్ని చేతుల్లోకి తీసుకొని తోడల్లుడు వెంకటేశ్వరరావు ని పార్టీ న్నుంది బయటకు పంపించాడు.అలాగే బావమరిది అయిన హరికృష్ణ ని పార్టీ వీడెయ్దాక వదల్లేదు చంద్రబాబు. రాజ్యాంగ శక్తి లా వ్యవహరించారు. ఇప్పుడు ప్రజలు చంద్రబాబు ని ఎక్స్పైరీ డేట్ అయిన రాజకీయనాయకుడిగా గుర్తించారు.జగన్మోహన్ రెడ్డి గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ముక్యమంత్రి అవుతామంటే చంద్రబాబు గాని కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకునేవారా అని నేను అడుగుతున్నా.
150 మంది ఎమ్మేల్యే లు సంతకాలు పెట్టి 36 మంది మంత్రులు జగన్ మోహన్ రెడ్డి  గారి ముఖ్యమంత్రి అయితేనే తప్ప మేము ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన వాళ్లందరిని చంద్రబాబు లాగా వైశ్రాయ్ హోటల్లో మకాం పెట్టినటైతే  జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయుండేవారు. తండ్రికిప్రజలకిచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర కొనసాగిస్తే దానినికాదన్నందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తో విభేదించారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఓదార్పు యాత్ర వద్దు అని అంటే గడ్డిపోచ లెక్క పదవిని వదిలేసుందడేవాడు. కేంద్రమంత్రి పదవి ఇస్తామన్నారు పార్టీ పగ్గాలు చేతికి ఇస్తామన్నారు అయినా సరే అధికార దాహాన్ని పక్కన పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం కోసం మామను చంపే వ్యక్తి నువ్వైతే వచ్చిన పదవిని పక్కన బెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
చంద్రబాబు రాజకీయ జీవితమే కుళ్ళు కుతంత్రాలతో నిండి పోయింది.అతని జీవితంలో ప్రజాతీర్పుతో గెలిచింది 1999 లో మాత్రమే. అప్పుడు కూడా బీ.జే.పి. దయా దాక్షిణ్యాల వక్ల్ల మాత్రమే గెలిసింది. నీ లాగా మామ పార్టీ ని లాక్కొలేదు. స్వన్థగా పార్టీ పెట్టి రాజకీయాలలో కొనసాగుతున్నాడు.దేశం లో అత్యంత మెజార్టీగా 5 లక్షలు 40 వేల మెజార్టీ తో గెలుపొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తనను గెలిపిస్తే అవనీతిరహితంగా రాస్ట్రాన్ని తీర్చిదిద్దుతానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మీలాగా రాస్ట్రాన్ని బ్రష్టుపట్టించరు. చిదంబరం కాళ్ళు పట్టుకుని కోర్టు లో స్టేలు తెచ్చుకున్నావు. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు.

తాజా వీడియోలు

Back to Top