స్పీకర్ : అంబటి రాంబాబు -మార్చి22,2012

నిన్న 7 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి పార్టీలు ఒక్క సీటు గెలుచుకోలేకపోయాయి. వాటిని టి.ఆర్.యస్. వైయస్ఆర్ పార్టీలు గెలుచుకున్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డిని 23 వేల మెజార్టీతో కొవ్వూరు ప్రజలు గెలిపించుకున్నారు. అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలను ప్రజలు తిరస్కరించారు. ప్రజలు వేరే పార్టీ కోసం చూస్తున్నారని అర్ధమవుతుంది. చంద్రబాబునాయుడుగారు తెలంగాణలోపోటిపెట్టి మా వాదన వినిపించాం. ఓడిపోయినా పర్వాలేదు అంటున్నాడు.కిరణ్ కుమార్ రెడ్డిగారు టిడిపి కి కంటే మేము బెటర్ అని డిపాజిట్ అయినా దక్కింది అని సంతోష పడుతున్నాడు.
చంద్రబాబునాయుడుగారికి ఒకటే చెబ్తున్నాం.చంద్రబాబునాయుడుగారు కొవ్వూరు ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని  గజదొంగా అని ప్రసన్నకుమార్ రెడ్డిని దొంగ అని అన్నారు. ఈ ఎన్నికల పలితాలతో గజదొంగ చంద్రబాబే అని ప్రజలే తెల్చారు. చంద్రబాబుగారు అన్నహజారే లాగా జెండా పట్టుకుని ట్యాంక్బండ్ దగ్గర నీతిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. అలాంటి వ్యక్తి కోసం కోవూరు ఉప ఎన్నికల్లో ఓటును 500 నుండి 700 దాక కొనలేదా అని అడుగుతున్నాం.
బొత్స సత్యనారాయణ గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ దాని విదానం దోసుకున్నది దాసుకోడమే అని అన్నారు. మేము అడుగుతున్నాం దోసుకున్నది దాసుకొన్నది, మద్యంతో ఆంధ్ర రాష్ట్ర ఓటర్లను మున్చిన్దేవరో ప్రజలకు తెలుసు.
బొత్స సత్యనారాయణ గారు లిక్కర్ కిక్కుతో అవాకులు చెవాకులు పేలుతున్నారు. నేను ముక్యమంత్రిగారు నైతిక బాద్యత వహిస్తామని బొత్స సత్యనారాయణ గారు  అంటున్నారు.నైతిక బాద్యత అంటే మీ జోడు పదవుల్లో కొనసాగడం నైతిక బాద్యత అవుతుందా.
లాల్బహేదూర్ శాస్త్రి గారు చిన్న రైల్వే యాక్సిడెంట్ జరిగితే తన పదవికి రాజీనామా చేశాడు. అలాగే వైయస్ రాజశేఖర్రెడ్డి గారి హయాం లో రెండు జడ్.పి.టి.సి. పదవులు ఓడిపోతే  ఆ నియోజకవర్గ మంత్రులను రాజీనామాలు చేయించారు. తెలుగుదేశంపార్టీ వారు మాట్లాడుతూ రాజీనామా చేశారు. కాబట్టి సానుబూతి ఉంటుందని అన్నారు.అలాగే తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామాలుచేసి గెలవాలని కోరుతున్నాం. మీకు డిపాజిట్లు కూడా దక్కవు అని తెలియజేస్తున్న. ఇదే గాక రేపు జరగపోయే 18 ఉప ఎన్నికల్లో కూడా వైయస్ఆర్ పార్టీ ఆ సీట్లని కైవసం చేసుకుంటుంది. నైతిక బాధ్యత వహిస్తామని మాటలు చెప్పడం కాదు దమ్ముంటే రాజీనామాలు చేసి నిరూపించండి. ఎల్లో పత్రికలు జగన్మోహన్ రెడ్డిని అన్ని విధాలుగా టార్గెట్ చేసాయి. ఓ మానసిక విశ్లేషకుడిని పట్టుకుని కధలు పుంకాలు పుంకాలుగా ప్రచురించాయి.
ఎల్లో మీడియా సి.బి.ఐ. చేత రేపో మాపో అరెస్ట్ అని ప్రచారం చేసారు. మొక్కవోని దైర్యంతో ముందుకు దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని  కోవూరు ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. కడప పులివెందుల ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టారు 150 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖర్చుపెట్టింది. కోవూరులో  50 కోట్లు పైన కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. 35 కోట్లు  తెలుగుదేశం పార్టీ ఖర్చుపెట్టింది. నీతిమంతులుగా చెప్పుకుంటున్నా మీకు మీకు ఈ డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో సమాధానంచెప్పాలి.

Back to Top