స్పీకర్‌: అంబటి రాంబాబు - జూన్ 15, 2012

ఈ రోజు 18 అసెంబ్లీ స్ధానాలు 1 పార్లమెంట్‌ స్ధానాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఘనమైన విజయం ఆ ప్రాంత ప్రజలు కట్టబెట్టారు.నూతన పార్టీ అయిన వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ15 స్ధానాలు గెలుచుకుంది.125 చరిత్ర గలిగిన కాంగ్రెస్‌ పార్టీ 2 స్ధానాలతో సరిపెట్టుకుంది. పరకాలలో మేము ఓడిగెలిచాము టీఆర్‌ఎస్‌ గెలిచి ఓడింది.టీఆర్‌ఎస్‌కు గట్టి పోటి ఇచ్చాము. రామచంద్రపురం నరసాపురం లో  తెలుగుదేశం ఓటమి ముందే గ్రహించి  కాంగ్రెస్‌కు సహకరించింది. నరసాపురంలో 8వేల మెజారిటి డిపాజిట్‌ కొల్పోయింది. మాజిమంత్రి 6వేల రావడానికి కారణం ఏంటి..  రాష్ట్రంలో రాబోయే పరిణామాలకు ఈ ఫలితాలే సూచిక. రాబోయే కాలంలో ఈ రెండు పార్టీలకు పతనం మోదలైంది. వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ ను జగన్‌మోహన్‌ రెడ్డిని అణగదోక్కడానికి అజాద్‌. వాయిలార్‌ రవి, కిరణ్‌కుమార్‌ బోత్స చిరంజీవి మోదలైన వారందరు ప్రచారం చేసిన ప్రజలు వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ను గెలిపించారు.  జగన్‌మోహన్‌రెడ్డి గారే తన అరెస్ట్‌కు వాయిలార్‌ రవి కారణం అని మాచర్ల ప్రచారంలో చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు  కూడ టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించారు.అని కొండా సురేఖగారే చెప్పారు. ముఖ్యమంత్రికి నైతిక భాధ్యత నైతిక విలువలు  తెలిసిఉంటే ప్రభుత్వాన్నా రద్దుచేసి ఎన్నికలకు సిద్దమవ్వాలి.


గట్టు రామచంద్రరావు గారు మాట్లాడుతూ...నరసాపురం, రామచంద్రాపురం స్ధానాల్లో సైకిల్‌ కాంగ్రెస్‌ గెలిచింది. తెలంగాణలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణ  ఎన్నికలలో పోటిచేస్తాం.చంద్రబాబు  మని ట్రాన్స్‌ఫర్‌ అనే స్కీంనీ ఓటు ట్రాన్‌ఫర్‌ స్కీంలా మార్చి పార్టీని చంద్రబాబు నాశనం చేసాడు. జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రచారం చేసి ఉంటే మిగతా సీట్లుకూడ గెలుచుకునే వాళ్ళం ....మెజారీటి ఇంకా పెరిగేది...

వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతూ .......రాంచంద్రపురం, నరసాపురంలో తెలుగుదేశం కాంగ్రెస్‌తో  కుమ్మకై తన ఓట్లు కూడ కాంగ్రెస్‌కు వేయించారు. అది ఓక నీచమైన గెలుపు  తెలుగుదేశం  కార్యకర్తలు చంద్రబాబుని నిలదీయవలసిన రోజు వచ్చింది, పార్టీని పెట్టింది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్‌కు తోత్తులా మారారు.

జనక్‌ ప్రసాద్‌ గారు మాట్లాడుతూ....   పరకాలలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది.. ముఖ్యమంత్రి గారే స్యయాన టీఆర్‌ఎస్‌కి ఓటేయమని చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో ఫిక్సింగ్‌ కాలేదు అంటే వచ్చే శాసన సభ సమావేశంలో  అవిశ్యాస తీర్మానం పెట్టాలి.... ఈ రోజు నుండి ప్రతి సమస్య మీద స్పందిస్తాం ప్రధానంగా రైతు సమస్యల మీద పోరాటం చేస్తాం. స్పందిస్తాం...
Back to Top