కాంగ్రెస్ ప్రబుత్వాన్ని కూలదోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకురావాలని ప్రజలు సిద్దంగా ఉన్నారు. త్వరలో జరగబోయే 18వ ఉపఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి తన విచక్షణ కోసం ఉంచిన 100కోట్ల రూపాయలు ఆ 18 నియోజక వర్గాల్లో నిదులుగా విడుదల చేశారు కాంగ్రెస్ ప్రబుత్వమ్ ఉపఎన్నికలు తేటుగా వస్తాయి అనుకుంది లేటుగా వస్తే ఆ విడుదల చేసిన నిదులను కార్యకర్తలకు మిగతా నాయకులకు పోసించాలనుకున్నారు. కొంచం ప్రజలకోసం ఖర్చు చేస్తున్నామని ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 100 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్డులు పోటీలో ఉన్నారు కాబట్టి. రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడు కూడా వాగ్దానాలు చేసి గెలవలేదు 2009లో కేవలం రెండే రెండు వాగ్దానాలు చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఉపఎన్నికల్లో వాగ్దానాలు ఎలా చేస్తున్నాడు విచిత్రంగా ఉంది. ఆయన అనుభవంతో చెప్తున్నాడో లేక అనుభవం లేక చెప్తున్నాడో తెలియడం లేదు. ఈ ఉప ఎన్నికలు ఉపఎన్నికలు కావు మినీ సార్వత్రిక ఎన్నికలు అని చంద్రబాబునాయుడు గారు అనుకుంటున్నారు. ఈ 18వ ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలవబోతుందని మాకు మీకు కాదు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు దగ్గర ఉన్న 100కోట్ల రూపాయలు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్న తెలుగుదేశం నాయకుడు దాని గురించి మాట్లాడ కుండ బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడుతారు. అసలు బొత్స సత్యనారాయణ స్తాయి పెరిగిందా లేక చంద్రబాబునాయుడిగారి స్తాయి తగ్గిందో అర్దం కావడం లేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా విజయనగరం వెళ్ళి బొత్స గారి ఇంటి దగ్గర ధర్నా చేసే స్థాయికి చంద్రబాబు గారు డిగజారిపోయడా?.............మద్యంకు బెల్టు షాపులకు ఆద్యుడు చంద్రబాబునాయుడు ఆయన బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడతాడు. వీరిద్దరు కుమక్కై నాటకాలు సాగిస్తున్నారు. పాల్వాయి గోవర్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ శేఖర రెడ్డి గారి పాలన పాపాలు చేసిందని ఆ పాపాలకు క్షమాపణ చెప్పాలట ....నేను ఒకటే అడుగుతున్న సోనియా గాందీ చెప్పిందని చెప్పి ఓ తీర్మానం చేయండి చేసి ఎన్నికలకు వెళ్లాలని అడుగుతున్నా... అలాగే కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్న చంద్రబాబుకు అడ్రెస్స్ లేకుండా చేయాలని ప్రజలను కోరుతున్న. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతుల పక్షాన కూలీల పక్షాన నిలబడి మంత్రి పదవులకు రాజీనామా చేశారు వాళ్ళు తప్పక విజయం సాదిస్తారు. పరకాలలో కొండా సురేఖ వైఎస్ఆర్ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తుంది. 17 నియోజక వర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గంలో మాకు కామన్ సింబల్ వస్తుంది. ఎలక్షన్ రూల్ ప్రకారమే మాకు గుర్తు వస్తుంది.