స్పీకర్‌ : అబ్ధుల్‌ హబీబ్‌ రహమాన్‌ - జూన్ 13, 2012

4.5 ముస్లిం రిజర్వేషన్‌ పై ఈ రోజు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్రంలో రాష్ట్రంలో  కాంగ్రెస్‌ పార్టీ ఉన్న ముస్లింస్‌ పై చిత్తశుద్ది లేదు. రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీనుండి  ముస్లింలు తలాక్‌లు తీసుకున్నారు. టూత్‌ పేస్ట్‌ దగ్గర నుండి కరెంట్‌ బిల్లులవరకు అన్ని బిల్లులు చెల్లిస్తున్నాం అందరిలాగా మాకు రిజర్వేషన్‌ ఎందుకు కల్పించడంలేదు. బీసీసోదరులు గాని  ఎస్‌సీ సోదరులకిగాని ఓసీ సోదరులకి గాని రిజర్యేషన్‌ ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు కాని మా వంతు మాకు రావాలి. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ముస్లింల మీద చిత్తశుద్దిలేదు. రాజశేఖరరెడ్డిగారి హయాంలో ముస్లింల రిజర్యేషన్‌ కోసం కోర్టుల్లో కోట్లాడి రిజర్యేషన్‌ తీసుకువచ్చారు. 4.5 రిజర్వేషన్‌ వల్లా కొంత మంది డాక్టర్స్‌ ఇంజీనీర్లు అయ్యారు.  అన్ని ప్రాంతాలవారికి అన్ని మతాలవారికి న్యాయం జరగాలి అంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఓక్కటే మార్గం.

మా వైయస్‌ కాంగ్రెస్‌ తరుపున ఆందోళన చేస్తాం, మా హక్కు మాక ఇవ్యకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాస్ట్ర ప్రభుత్వం ఎందుకు. ఇంతవరకు మాకు సెకండ్‌ ఆఫ్టన్‌ లేదు కాబట్టే ఇంతవరకు కాంగ్రెస్‌ పార్టీ  బతికి ఉంది ఇప్పుడు మాకు వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగాఉంది.       

ముస్లింలకు  మేలు చేసినందుకే  బీహర్‌లో రెండు సార్లు నితీస్‌ కుమార్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముస్లింల మద్దతులేకుండా రాహూల్‌ గాంధీ ఎలా ప్రధానమంత్రి అవుతాడు మాకు అర్ధంకావడంలేదు. గులాంనభి అజాద్‌ కాశ్మీర్‌ ముఖ్యమత్రిగా ఉన్నప్పుడు ఈరిజర్వేషన్‌, ఈ పధకాలు అమలుచేయకుండా  ఇక్కడికి వచ్చి  మాకు సలహాలు ఇస్తున్నారు. సల్మాన్‌ఖుర్షిద్‌ ఓ లా మినిష్టర్‌ ఆయివుండి ముస్లింల గురించి తప్పు మాట మాట్లాడుతున్నారు.
Back to Top