స్పీకర్ : జూపూడి ప్రభాకరరావు - మే 3,2012

తిరుమలలో జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే నేపద్యంలో, చివరికి తెలుగుదేశం పార్టీ మతవిశ్వాసాల మీదకు వెళ్లి అక్కడ కూడా దాడి చేసే ఓ నీచ స్థాయికి వెళ్ళిన విధానం కనపడుతుంది. చంద్రబాబునాయుడు గారు తిరుపతిలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు నాస్తికుడని తిరుమల,తిరుపతి దేవస్థానంకు ఎప్పుడు రాలేదు అని చెప్పడం జరిగింది. నిన్నా జగన్ మోహన్ రెడ్డి గారు తిరుమల దేవస్థానంకు వెళితే డిక్లరేషన్ సరిగా ఇవ్వలేదు అనే అపవాదుని జగన్ మోహన్ రెడ్డి గారి మీద నెట్టే ప్రయత్నం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ఎం.పి. ఒక రాజకీయ పార్టీకి అద్యక్షుడు, ఆయనకి ఓ ప్రోటోకాల్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ ప్రకారం చూసుకోవడానికి టీ.టీ.డి. అధికారులు దేవాదాయ శాఖ మంత్రి ఉంటారు. వాళ్ళు ఎవరూ అబ్జక్షన్ పెట్టడంలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొంతమంది నాయకులు ఈ విషయాన్ని రాద్దాంతం చేసారు. జగన్ మోహన్ రెడ్డి గారు పుట్టినప్పటినుండి ఎన్నో సార్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడేదో కొత్తగా వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు. మొన్నటి దాక జగన్ మోహన్ రెడ్డి కులం మీద మతం మీద ఓదార్పు యాత్ర మీద ఎన్నో రకాలుగా ప్రచారం చేసారు. ఓదార్పు యాత్రలో ఏ గ్రామానికి వెళ్ళిన గుడికి వెళ్తారు,చర్చికి వెళ్తారు, మసీద్ కి వెళ్లారు అప్పుడు గుర్తుకు రాలేదా మతాల గురించి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. భక్తి వ్యక్తిగతమైనది ఆ మనిషి కి సంబందించింది. సెక్యులర్ కంట్రీలో చంద్రబాబు ఇదే విధం గా మాట్లాడినట్టు అయితే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్షకు అర్హుడవుతాడు. సామాన్య బక్తుడి లాగే జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం చేసుకున్నాడు. దేవుడికి దగ్గరగా ఉన్న 17 నెంబర్ ద్వారంను మూసివేశారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే. రిలయన్స్ అంబానీలకు సాగిలాపడి దేవుడికి దేవుడికి దగ్గరగా పెట్టి చూయించిన సంఘటనలు లేవా అని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కి నూకలు చెల్లాయి. మీ పార్టీ సెక్యూలర్ పార్టీనా కాదా. మీ పార్టీకి ఉన్న విధివిధానాలు ఏంటి. రాజశేఖర్ రెడ్డి గారు తన 5సంవత్సరాల కాలంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు. అది చాలదా మీకు కుటుంభం లో ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇవ్వాళా... ప్రజల నమ్మకాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ప్రతిసారి మీరు ఓడిపోతారు. మత విశ్వాసాల మీద వ్యక్తిగతమైన నమ్మకాల మీద దాడి చేసే విధానం మానుకోపోతే పుట్టగతులుండవు. రాజశేఖర్ రెడ్డి గారికి సంబందించిన జగన్ మోహన్ రెడ్డి గారికి సంబందించిన జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ విధం గా డిక్లరేషన్ ఇవ్వలేదు అంటారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే నువ్వా మాట్లాడేది. డిక్లరేషన్ గురించి అడగడానికి నువ్వు ఎవరు... దానికి మంత్రులున్నారు మంత్రి గారే చెప్పరు మాకు డిక్లరేషన్ ముఖ్యం కాదు అని. మీరు మీపార్టీ అందుకే అగాధపు అంచుల్లోకి వెళ్తున్నారు.

Back to Top