స్పీకర్‌: గట్టు రామచంద్రరావు- మే 14,2012

స్పీకర్‌: శ్రీ గట్టు రామచంద్రరావు, అధికార ప్రతినిధి                                  

రాష్ట్రంలో ఉస ఎన్నికలు దగ్గరపడేకొద్ది దుష్టచతుష్టయం రాష్ట్రవ్యాప్తంగా చిందులేస్తుంది. బొత్స సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌ రెడ్డి, చిరంజీవి. ప్రతిపక్షం అని మర్చిపోయి అధికార పక్షానికి బ్రాంచి ఆఫీస్‌గా మార్చిన చంద్రబాబునాయుడు దుష్టచతుష్టయం ఎన్నికలకు భయపడి  ఓడిపోతామాని తెలిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అబద్దాలనే అయుధాలగా ప్రచారం సాగిస్తున్నాయి.ఇవన్ని పని చేయకపోయేసరికి జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్టర్‌ని డీఫెం చేయడానికి ఒక రాజకీయ పద్మవ్యాహం పన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అభిమన్యుడు కాదు అర్జునుడుఅనే విషయం గుర్తుపెట్టుకొవాలి. రకరకాల రాజకీయ విన్యాసం చేసి  హంతకుడు అని హంతకుడితో సంబందాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ని 8 తర్వాత విధ్యంసం సృష్టించడానికి బాంబులు తయారుచేసుకుని వస్తాడట... అసలు బాంబులు చరిత్ర తెలుగుదేశం వారిది కాదా, మాజి మంత్రిగారింట్లో డైరక్టుగా  బాంబ్‌లు పేలి చనిపోయన విషయం మర్చిపోయారా..హత్యరాజకీయాలు మీవే కదా..తన పలుకుబడి పెంచుకొడానికి మల్లేలబాబ్జి సృష్టించి అబద్దపు హత్య ప్రయత్నం సృష్టించి ఆధారాలు లేకుండా మట్టుబెట్టలేదా... నడిరోడ్డు మీద ప్రజాభిమానం గల వ్యక్తిని దీక్ష చేస్తుండగానే చంపిన ఘనతమీదే కదా....పార్టీకి వ్యతిరేకంగా రాసారని ఓ పాత్రికేయుడుని చంపించినది మీరే కాదా...గాంధీ గారి మూడు కోతులు చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు మాట్లడవద్దు అంటే సోనియాగాంధీ గారి మూడు కోతులు మాత్రం చెడుమాత్రం వింటున్నాయి, మాట్లాడుతున్నాయి. 
కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి తమ ప్రభుత్వం చేసిన మంచి పనులతో ఓట్లు అడగగలరా అని అడుగుతున్నాం... ఈ రోజు ఎన్నికలు జగన్‌మోహన్‌రెడ్డి గారి స్వార్ధం వల్లే వచ్చాయని చంద్రబాబు అంటున్నారు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు అనిఅంటున్నారు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే అధికారంలో ఉన్న వాళ్ళకి అమ్ముడు పోవాలి అధికారంలేని జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు ఎందుకు వస్తారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి, మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి గారికి ఆరోగ్యశ్రీ పెట్టమందే నేను, రాజశేఖరరెడ్డి గారి కుటుంబాన్ని కాపాడిందే నేను అని కిరణ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. ఉప ఎన్నికల తర్వాత ఈ పదవి ఉండదని తెలిసి ప్రస్టేషన్‌ లో మాట్లాడుతున్నారు.కిరణ్‌కుమార్‌ రెడ్డికి తమ పరిపాలనలో మంచి పనులకు ఓటేయండి అని అడిగే  దమ్మునీకుందా అని అడుగుతున్నాం. ఉప ఎన్నికలను ఓ చాలంజ్‌గా తీసుకుంటున్నారు ఇది రిఫరెండ్‌మే అని చెప్పే దైర్యం గాని ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని ప్రజలకుచెప్పగలవా.. రాజశేఖరరెడ్డి గారు ఆ మాట చెప్పారు. ఈ 18 ఎన్నికల్లో ఏ ఓక్కటైన గెలుస్తామని చెప్పే దైర్యం మీకుందా.....బొత్స సత్యనారాయణ గారు నీతి నిజాయితి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటిదాక మద్యం కుంభకోణం మీద మీ పాత్ర ఏంటి నిజంగా నీవు నిజాయితి పరుడువు అయితే రాజీనామా చేసి రంగం మీదకు రా... రాజశేఖరరెడ్డి గారి బొమ్మలేకుండా సోనియాగాంధీ బొమ్మతో గెలుస్తావా అని చాలంజ్‌ చేస్తున్నాం...ఈ దుష్టచతుష్టయం ఎన్ని మాటలు మాట్లాడినా స్కిప్ట్‌ మాత్రం ఢిల్లీలో తయారవుతుంది. చిరంజీవిగారి బందువులింట్లో 80 కోట్లు 70 కోట్లు అటుఇటుగా కొంత డబ్బు దొరికితే జరిగినదాని కంటేకొంత ఎక్కువగా రాసారని స్పంచిందిన వీరందరరిని ఓమాట అడుగుతున్నాం అదే డబ్బు జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లోనో లేక పక్క ఇంట్లోనో దొరికితే మీరు ఎలా స్పందించేవాళ్ళా అనిఅడుగుతున్నాం.

Back to Top