స్పీకర్ :గట్టు రామచంద్రరావు -ఫిబ్రవరి 29,2012

ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వం రైతు సమస్యలను విస్మరిస్తుంది. అసెంబ్లీ లో ప్రజల సమస్యలు గుర్తుకురాకుండా చంద్రబాబు కిరణ్ కలసి సభను ప్రక్క దోవ పట్టిస్తున్నారు, మొదట నుండి చంద్రబాబు రైతులకు వ్యతిరేఖంగా పని చేశారు, వారి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు ప్రపంచబ్యాంక్ ఆదేశాల మేరకు పని చేసినా వ్యక్తి చంద్రబాబు, చంద్రబాబు బాటలోనే కిరణ్ సర్కార్కు రైతులకు ,వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రైతులకు మేలు జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు రైతుల కోసం పధకాలు ప్రవేశపెట్టారు. ఆ పధకాలు కొనసాగిస్తే రాజశేఖర్ రెడ్డి గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని, దీనివల్ల వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ మరీంత బలపడుతుందని పధకాలను కొనసాగిన్చడంలేదు. ఒక పక్క అసెంబ్లీ రైతాంగ సమస్యలపై ముందుకు వస్తుంటే వాటిని పక్క దోవ పట్టిస్తున్నారు. బియ్యం ఎగుమతులవల్ల ఆంక్షలు ఉండడం వల్లే ఈ సమస్యలు అని చర్చకు తీసుకువచ్చారు. బియ్యం ఎగుమతులవల్ల ఆంక్షలు లేకపోతేయ్ ఈ సమస్యలు తీరతాయా అని నేను అడుగుతున్నా. రైతులకు పంటలు పండించడానికి ముక్యంగా ఎరువులు,పురుగుమందులు,విత్తనాలు గిట్టుబాట ధర కావాలి.వీటి మీద చర్చలు ఏమి జరగకుండానే ఒక్క ఎగుమతుల మీద జరగడం భాధాకరం చంద్రబాబు అధికారంలో ఉండగా ఓ మాట చెప్పారు పేదరికం పోవాలంటే భూ పంపకమే మార్గం కాదు నీటి ఎద్దడి పోవాలంటే తుపాన్లు ఒక్కటే మార్గం అని అన్నారు. వ్యవసాయంలో సమస్యలు తగ్గించడం కంటే వ్యవసాయాన్ని తగ్గించాలి అన్న వ్యక్తి చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం కోసం 13వేల కోట్లు ఖర్చు పెట్టారు.ఇప్పుడే రేట్లు అన్నీ పెరిగిపోయాయి పురుగుమందులతో సహా అన్ని పెరిగాయి కానీ ధాన్యం రేటు మాత్రం పెరగడంలేదు, కోనసీమ అని చెప్పుకునే కోనసీమ లో ఈ నాడు సాగు భహిష్కరణ జరుగుతుంది.20లక్షల టన్నుల ధాన్యం ఎగుమతి చేసే పర్మీషన్ ఉంటే 10లక్షలు మాత్రమే చేసాం, మొన్నితి వరకు వ్యవసాయరంగానికి మంత్రి లేదు, అగ్రికల్చెర్ యూనివెర్సిటీ కి వి.సి. లేదు. ప్రభుత్వం రైతుల మీద ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అని గట్టు రామచంద్రా రావు  పేర్కొన్నారు.

Back to Top