స్పీకర్: గట్టు రామచంద్ర రావు - ఏప్రిల్18,2012

రాష్ట్రంలో అదికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేయడానికి డిల్లీ నుండి వాయిలర్ రవి గారు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం ఇవ్వడానికి వచ్చను 
అని వాయిలర్ రవి అంటున్నారు. నువ్వు చికిత్స చేయడానికి అసలు కాంగ్రెస్ పార్టీ బతికిలేదు. రవి మంచి డాక్టర్ గాని పేషెంట్ బతికి లేదు కదా .. కాంగ్రెస్ అంపశయ్య 
మీద ఉంది. అసలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గా మారిపోయింది మిగిలింది పి‌ఆర్‌పి కాంగ్రెస్ మాత్రమే. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి బయటకు పోయారో అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయింది. రాజశేఖర్ గారిని టిడితే పదవులిఛి జగన్మోహన్ రెడ్డి మీద దూషణలకు దిగిన నేతలకు అందలం ఎక్కించి కాంగ్రెస్ పార్టీని 
చేతులారా చంపుకుంది డిల్లీ తప్ప ఇక్కడ కాదు. అసలు జబ్బు డిల్లీలో ఉంది కానీ హైదరాబాద్ లో కాదు మందు ముందు డిల్లీలో వెయ్యాలి.జగన్ మోహన్ గారి పేరు చెబితే కాంగ్రెస్ నేతల్లో గుబులు పుడుతుంది.

చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద అబండలు వేయడం కుటుంబాన్ని అవమానాల పాలు చేయడం వైఎస్ విజయమ్మ గారు పెట్టిన కంటతడి ఇవాళ వీళ్ళకి శాపంగా తగులుతుంది. కాంగ్రెస్ పాపం పండింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడీ గారు సేవ చేశారు అని మీరు నమ్మితే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి మీరు ఏం చేశారని 
అదుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి పాలన దేశానికే ఆదర్శం అని ప్రధానమంత్రే అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూడలేక రాజశేఖర గారి విగ్రహాల జోలికి, కులం జోలికి పోయారు. రాజశేకర్ రెడ్డి గారి కులం ఆయన 6 సంవత్సరాల పరిపాలనలో కనబడలేదా ..... లౌకిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి కులం గురించి చెపుకొనే దుస్తుతి వచ్చింది. రాజశేఖర రెడ్డి మావాడు ఆయన యుగం స్వర్ణయుగం అని చెప్పుకుంటున్న మీరు రాజశేఖర్ రెడ్డి గారిని తిడుతున్న కొండ్రు మురళి, హనుమంత రావుల మాటలు వినబడలేదా.... డిల్లీ నుండి వచ్చిన రవిగారు జనం సమస్యలు పట్టించుకోకుండా బొత్సాని, కిరణ్ ని ఎలా తప్పించాల అని రవిగారు హైదరాబాద్లో తిరుగుతున్నారు.పదవిని కాపాడటంకోసం కిరణ్ డిల్లీలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ డిల్లీ నుండి గల్లీ దాకా సంక్షోమంలో కూరుకు పోయింది. ఉప ఎన్నికలు జరగబోయే యోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుగానే నియోజకవర్గ అబివృద్ది కోసం అని నిదులు కేటాయించింది. ప్రతిపక్షంతో కుమ్మక్కు అయిన తర్వాత వాయిలాల రవి కాపాడలేరు. అయ్యా చంద్రబాబు గారు వైశ్రాయి హోటల్లో ఎం‌ఎల్‌ఏలను పెట్టినపుడు ఎంత ఇచ్చారు ...... ఎన్‌.టి రామరావు గారి మీద చెప్పులు వేసినప్పుడు మనిషికి ఎంత ఇచ్చావు .....ఇప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నందున కాంగ్రెస్ దగ్గర ఎంత తీసుకున్నావు అని అడుగుతున్నాము.

తాజా వీడియోలు

Back to Top