స్పీకర్‌ : అంబటిరాంబాబు - మే 29, 2012

మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గారి అరెస్ట్‌కు నిరసనగా 10 రోజులపాటు మండలహెడ్‌ క్వార్ట్‌ర్స్‌లో రిలే నిరహర ధీక్షలు, శాంతి యుతంగా నిరసనలు తెలిపే కార్యక్రమంచేయడం జరుగుతుంది. ఉప ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాల్లో వీటికి మినహయింపు.
ఉంటుంది. మొన్న జగన్‌మోహన్‌రెడ్డిగారిని సాయంత్రం 7.20 అరెస్ట్‌ చేసినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించింది. 4 గంటల నుండి రాష్ట్రంలో అన్ని డిపోల్లో బస్‌లు నిలిపివేశారు,అంతకు ముందు రెండురోజుల నుండి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్‌చేసారు.18 నియోజిక వర్గాల్లో పోటిచేస్తున్నా నాయకులను అరెస్ట్‌చేస్తే ఎన్నికల అధికారి జోక్యంతో వారిని విడుదలచేసారు. కొంత మంది నాయకులను హౌస్‌ అరెస్ట్‌చేసారు. ఒక పార్టీ అధ్యక్షుడిని చట్టపరంగా అరెస్ట్‌చేయవలసి వస్తే ఇంతా ఎక్స్‌స్టాడ్‌నరీగా చర్యలు ఎందుకుతీసుకున్నారు.ఇది ఒక అన్యాయమైన అరెస్ట్‌. స్వాతంత్రం తర్వాత ఆంధ్రరాష్టంలో ఎప్పుడైన చూశామా...సాయంత్రం  4 గంటల తర్వాత ప్రజాజీవితంను ప్రభుత్వమే బంద్‌చేసింది. ఈ అరెస్ట్‌ను ప్రజలు ప్రతిఘటిస్తారు అని భయం. జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌చేసారు, ఉప ఎన్నికల్లో జగన్‌మోహనరెడ్డి గారి అరెస్ట్‌తో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బెదురుతుందని అరెస్ట్‌చేసారా.....లేక సోనియాగాంధీ ని ఎదిరించాడని జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్‌చేసారా..లేక సోనాయాగాంధీ మాట కాదని ఓదార్పుయాత్ర చేసాడని అరెస్ట్‌చేసారా....ఇటలినుండివచ్చిసోనీయాగాంధీ ఒక మాఫీయా లాగా తయారై జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపింది.తెలుగుప్రజలు ఈ విషయాన్ని సహించరు. మళ్ళి ఇటలీ వెళ్ళేదాకా ప్రజలు విమ్మరించబోరని తెలియచేస్తున్నా.. కాంగ్రెస్‌ నాయకులు అందరు సోనీయాగాంధీ కుటుంబాన్ని రాజశేఖరరెడ్డి గారి కుటుంబం విమర్శిస్తుందని అంటున్నారు. ఎవరు గాంధీ కుటుంబం అని అడుగుతున్న ఈమే ఇండియా గాంధీ కాదు ఇటలీగాంధీ.గాంధీ ముసుగులో మీరుచేస్తున్న వ్యవహరాన్ని బట్టబయలు చేయడానికి తెలుగుప్రజలు కంకణం కట్టుకున్నారు. ఈరోజు జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్‌చేసామని అనంద పడుతున్నారుకాంగ్రెస్‌ తెలుగుదేశం వాళ్ళు, మీఆనందం మూన్నాళ్ళ ముచ్చటే రాబోయేది జగన్‌మోహన్‌రెడ్డిని కాలం. కాంగ్రెస్‌ వాళ్ళు ఒకే మాట చెబుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌తో కాంగ్రెస్‌కి ఎలాంటి సంభందంలేదని, కాని మేము చెబుతున్నాం జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌తో సోనియాగాంధీకి, కిరణ్‌కుమార్‌ రెడ్డికి, బోత్స సత్యనారాయణకి, చంద్రబాబుకి అందరికి సంభందం ఉంది. విజయమ్మ కన్నీటి బోట్టును కూడ  అపహస్యంగా మాట్లాడుతున్నారు బోత్స సత్యనారాయణ,కిరణ్‌కుమార్‌ రెడ్డి  మీ ఇద్దరికి  డిపాజిట్ల్‌ కూడ రావు మీ నియోజికవర్గాల్లో . ఈరెండు సంవత్సరాల కాలంలో నలిపేద్దం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ని అనుకుంటున్నారేయో నలిపేస్తే నలిగిపోయోదికాదు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ........ బపూన్‌గా పేరుపోందిన లగడపాటిరాజగోపాల్‌ గారు మాట్లాడుతున్నారు.అతని గెస్ట్‌హౌస్‌లో పేళుళ్ళు జరిగితే దానిని జగన్‌మోహన్‌రెడ్డి గారికే అంటగడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌మోహన్‌రెడ్డి గారికి అంటించాలని చూస్తున్నారు. రాజశేఖరరెడ్డిగారి మరణం మీద మీకు అనుమానులున్నాయి అని పార్టీ ప్లీనరీలోనే ప్రకటించాం. అసలు బ్లాక్‌ బాక్స్‌లో 33 నిమిషాల వ్యవదిగల మేటర్‌లో 7నిమిషాలు మాత్రమే ఉంది. మిగిలినది ఎమైంది. అని అడుగుతున్నాం. వీటి మీద మాకు అనుమానాలున్నాయి. పరిటాల హత్యకేసులో సీబీఐ ఎంక్వరి వెయ్యమనండి, వంగవీటిమోహన్‌ రంగాహత్య కేసులో సీబీఐ ఎంక్వరివేయమనండి చంద్రబాబు తన ఆస్తుల మీద  సీబీఐ ఎంక్వరి వేసుకుంటామని చెప్పమనండి, మాకు ఏ విధమైన అభ్యంతరంలేదు.ఒకే కేసులోముద్దాయిగా జగన్‌మోహన్‌రెడ్డి, మోసిదేవి ఉంటే మోసిదేవికి ముఖ్యమంత్రి క్లీన్‌చీట్‌ ఎలా ఇస్తారు, సీబీఐ నుండి పరిటాల కేసులో జగన్‌మోహన్‌రెడ్డి పేరు తీయించాను అని ముఖ్యమంత్రి అంటే ఆయన తక్షణమే రాజీనామా చేయాలి.
Back to Top