స్పీకర్ : అంబటి రాంబాబు -మార్చి9,2012

రామోజీరావు గారు జగన్ మోహన్ రెడ్డి ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని వారికి సమాచారం ఉందని ఆయనను అరెస్ట్ చేస్తే తన ఆస్తులమీద, భూములమీద దాడులు జరుగుతాయని పోలీసులకు, ముఖ్యమంత్రి లేఖలు రాసారు. జగన్ మోహన్ రెడ్డిని 
అరెస్ట్ చేస్తున్నారని ముందుగా రామోజీరావుకు ఎలా తెలిసింది? రామోజీరావు నిజంగా జగన్ అరెస్ట్ చేస్తే నష్టం కలుగ్గుతుందనా లేక కోవూరు ఉపఎన్నికల్లో చంద్రబాబునాయుడు కు లబ్దిచేకూర్చడానికాఅనే అనుమానం కల్గుతుంది. సీబీఐకి రామోజీరావుకి మద్య ఉన్న అనుబంధంవల్ల ఆయనకు ముందుగానే అరెస్ట్ల విషయం తెలుస్తుందని నమ్మవలసిన అవసరం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు నీపేపర్ అయినా ఈనాడుని చదవద్దని ఎప్పుడు చెప్పలేదు నేను చదవను అన్నాడు. కాని చంద్రబాబు సాక్షి పేపర్ చదవద్దు అనడం విడ్డూరంగా ఉంది. వైయస్ఆర్ అభిమానులు గాని కార్యకర్తలుగాని ఎవరు నీ ప్రాపర్టీని ఎవరు నష్టం కలుగజేయరు. నీ పాపం పండినరోజు నిన్ను ఎవరూ కాపాడలేరు. చంద్రబాబు హయాంలో పేదల భూములు ఆక్రమించి స్టూడియోలు కట్టలేదా?

చంద్రబాబును ముక్యమంత్రిని చేయడానికి నువ్వు తప్పుడు కధనాలు రాస్తున్నావు. నీ తప్పుడు రాతలతో ప్రజలను మోసగిస్తున్నావు. 5సంవత్సరాల 3నెలల దేవుడి పాలన అందించిన రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి అంతమొందించారు ఆయన కొడుకుని దొంగా అని ముద్ర వేసి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని దొంగా అంటున్నాడు రేపు 21న కోవూరు ఎన్నికల ఫలితాలతో జగన్ దొంగలేక చంద్రబాబు దొంగో ప్రజలు తేలుస్తారు చిన్న తనంలో ఒక కథ ప్రాచూర్యంలో ఉంది ఓ బ్రాహ్మణుడు మేకను తీసుకెలుతుంటే  ఏడుగురు గజదొంగలు దాన్ని చూసి కుక్క కుక్క కుక్క అని అంటే బ్రాహ్మణుడు మేకను వదిలేసి వెళ్ళాడు దాన్ని ఆ ఏడుగురు కోసుకు తిన్నారట అలాగే రామోజీరావు, చంద్రబాబు,రాధకృష్ణ,సోనియాగాంధీ,అహ్మద్ పటేల్ అందరు కలసి జగన్ మోహన్ రెడ్డిని దొంగా దొంగా అంటున్నారు.దీనిని తెలుగు ప్రజలు నమ్మరని తెలియజేస్తున్నా. జగన్ మోహన్ రెడ్డి గారి స్వర్ణయుగానికి రాబోయే ఉపఎన్నికలే నిదర్శనం, పాలకపక్షం గాని ప్రతిపక్షంకి గాని డిపాజిట్ మిగలదు.

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం రాజకీయ కుట్రతో కూడిన హత్యగానేను భావిస్తున్నా. ఈ జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం రాజశేఖర్ రెడ్డిగారిని అతి దారుణంగా హత్య చేసి, జగన్ మోహన్ రెడ్డి గారిని అతి దారుణంగా అణగదొక్కుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 26 జీఓలు విడుదల చేసిన శంకర్రావుగారు తెలుగుదేశంవారు కోర్టులో వేస్తె 26 జీఓలు విడుదల చేసిన మంత్రులది తప్పుకాదు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు దోషీ అంటారు అప్పుడు ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న జగన్ మాత్రం నేరస్తుడట అతన్ని అరెస్ట్ చేస్తారట ఎలా అరెస్ట్ చేస్తారు? రాజశేఖర్ రెడ్డిగారిది రాజకీయ హత్య అని నేను నమ్ముతున్నా. ఈ రోజు జగన్ ని అణగదొక్కాలని చూస్తున్నారో వారీ దీనికి కారణం. ప్రజలు గమనిస్తున్నారు భవిష్యత్ జగన్ మోహన్ రెడ్డి గారిదే అని తెలియచేస్తున్నా.

తాజా ఫోటోలు

Back to Top