చంద్రబాబునాయుడు గారు కోవూరు పర్యటనలో తోటకూర కధలు అవనీతిమీద హరికధలు శ్రీమతి విజయమ్మ గారిమీద వ్యక్తిగత ఆరోపణ చేసారు చంద్రబాబునాయుడు గారు తన గత చరిత్ర మర్చిపోయారు గాని తెలుగు ప్రజలు మాత్రం ఆయన చరిత్ర మర్చిపోలేదు అందుకో రెండు సార్లు 2004 లో 2009లో చంద్రబాబుని ప్రజలు పక్కన బెట్టారు, శ్రీమతి విజయమ్మకి చంద్రబాబునాయుడు గారు నీతివాక్యాలు చెప్తున్నారు. చంద్రబాబునాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా?మొదట కాంగ్రెస్ పార్టీలో ఉంది తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్.టి.రామారావు గారిని వెన్నుపోటు పొడిచి బావమరిదిని తోడల్లుడిని మోసంచేసిన ఘనత నీది కాదా తన స్వార్ధప్రయోజనాల కోసం కుటుంభ సభ్యులను ఉపయోగించుకున్న చరిత్ర చంద్రబాబునాయుడు గారిది. అధికారం రాదనే బాధతో చంద్రబాబునాయుడు గారు ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు అంతా అవనీతి వ్యక్తి దేశంలోనే లేడు. తెహల్కా పత్రికా నీ చరిత్రని ప్రజలకు చెప్పింది.చంద్రబాబునాయుడు గారి అబ్బాయి విదేశాల్లో సత్యం రామలింగరాజు డబ్బుతో చదవడం నిజంకాదా అని నేను అడుగుతున్నా. చంద్రబాబునాయుడు గారి పద్దతిలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నడుపుతున్నాడు ఆర్టిసీని ప్రైవేటీకరణను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, అవసరమైతే కార్మీకులకోసం ప్రజాపోరాటాలను నిర్వహిస్తుంది.