వైయస్ జగన్ మోహన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు.  దేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్ట బద్ధ పాలనను నిలబెట్టడంలో పౌర హక్కులను పరిరక్షించటంలో, సామాజిక న్యాయాన్ని అందించటంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని అన్నారు.Back to Top