రాష్ట్ర సమస్యలపై 20న వైయస్‌ఆర్‌సిపి సమావేశం

హైదరాబాద్, 17 ఫిబ్రవరి 2013: అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నది. ఈ నెల 20న జరగనున్న ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలకమండలి, కార్యనిర్వాహక మండలి సభ్యులు, జిల్లా పార్టీ అడ్‌ హాక్‌ కమిటీ కన్వీనర్లు, జిల్లాల కో ఆర్డినేటర్లు, పరిశీలకులు, అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు పాల్గొంటారని పార్టీ సంస్థాగత వ్యవహారాల సమన్వయకర్త పి.ఎన్‌.వి.ప్రసాద్‌ తెలిపారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న శ్రీమతి విజయమ్మ క్యాంపు కార్యాలయంలో ఆ రోజుడ ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ప్రసాద్‌ వివరించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, కరెంటు కష్టాలు, సంక్షేమ పథకాలు నీరుగారుతున్న విధానంపై పార్టీ చర్చించనున్నట్లు తెలిపారు. సంస్థాగతంగా సభ్యత్వ కార్యక్రమం, పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ కూడా ఈ సమావేశం ఎజెండాలో ఉంటుందన్నారు.
Back to Top