పార్టీ ఎస్‌టి సెల్‌ కన్వీనర్‌గా రవీంద్ర నాయక్‌

హైదరాబాద్‌ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌.టి. సెల్‌ కన్వీనర్‌గా మాజీ ఎం.పి.  డి. రవీంద్ర నాయక్‌ నియమితులయ్యారు. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం రవీంద్ర నాయక్‌ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే రవీంద్ర నాయక్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొంతకాలం పాటు రాష్ట్ర మంత్రిగా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రాంతంలోని ఎరుకుల, లంబాడాలను ఎస్‌.టి.లుగా గుర్తింపు తీసుకురావడానికి రవీంద్ర నాయక్‌ జాతీయ స్థాయిలో విశేషంగా ప్రయత్నించారు.

Back to Top