వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా లంకా శ్రీధర్‌

అమరావతి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా లంకా శ్రీధర్‌ను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లంకా శ్రీధర్‌ పార్టీ ఆవిర్భావం నుంచి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంట ఉంటున్నారు.

పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను అధినేత వైయస్‌ జగన్‌ గుర్తించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకితభావంతో పని చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుంటామని పేర్కొన్నారు.
 

Back to Top