14 నుంచి వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్, 12 మార్చి 2014:

'స్థానిక', సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, అధినేత సోదరి శ్రీమతి షర్మిల రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల తరఫున వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. శ్రీ జగన్ ఎన్నికల ప్రచార పర్యటన ఈ నెల 14న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రారంభమై 17న రాజమండ్రిలో ముగుస్తుందని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

శ్రీ వైయస్‌ జగన్, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాకు వెల్లడించారు. శ్రీమతి విజయమ్మ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటన అనంతరం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తారని ఆయన‌ తెలిపారు. శ్రీమతి షర్మిల శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటన తరువాత నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి కూడా తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని, త్వరలోనే మిగతా షెడ్యూల్‌ను వెల్లడిస్తామని రఘురాం పేర్కొన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రచార షెడ్యూల్ :
మార్చి 14 : సాయంత్రం 4.00 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో బహిరంగసభలో అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మార్చి 15 : పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులలో రోడ్‌షో నిర్వహిస్తారు.
మార్చి 16: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో రోడ్‌షో, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రోడ్‌షోతో పాటు బహిరంగ సభ ఉంటుంది.
మార్చి 17: అమలాపురం, ముమ్మడివరంలలో రోడ్‌షో, రంపచోడవరంలో రోడ్‌షో, బహిరంగసభ, మండపేటలో రోడ్‌షో నిర్వహిస్తారు.
మార్చి 18 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మున్సిపాలిటీలలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పర్యటిస్తారని తలశిల రఘురాం తెలిపారు.

శ్రీమతి విజయమ్మ ప్రచార షెడ్యూల్‌:
మార్చి 16 : అనంతపురం జిల్లాలోని కదిరి, పుట్టపర్తిలలో రోషో, హిందూపురంలో బహిరంగసభలో ప్రసంగిస్తారు.
మార్చి 17 : అనంతపురం జిల్లాలోని మడకశిర, ధర్మవరంలలో రోడ్‌షో, అనంతపురంలో బహిరంగసభ.
మార్చి 18 : అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో రోడ్‌షో, రాయదుర్గంలో బహిరంగసభ ఉంటుంది.
మార్చి 20 నుంచి గుంతకల్లు, గుత్తి, పామిడి, తాడిపర్తి, కర్నూలు జిల్లా బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. అనంతరం తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎన్నికల ప్రచారం ఉంటుంది.

శ్రీమతి షర్మిల ప్రచార షెడ్యూల్ :
మార్చి 17 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో బహిరంగసభలో ప్రసంగిస్తారు.
మార్చి 18 : నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో బహిరంగసభ, నాయుడుపేటలో రోడ్‌షో, సూళ్లూరుపేటలో బహిరంగసభ.
మార్చి 19 : నెల్లూరు జిల్లాలోని గూడూరులో రోడ్‌షో నిర్వహిస్తారు. నెల్లూరులో బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగింస్తారు.
మార్చి 20 నుంచి కావలి, ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, చీరాల, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.. అనంతరం తెలంగాణలోని నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని శ్రీమతి షర్మి ప్రారంభిస్తారు.

తాజా ఫోటోలు

Back to Top