న్యూఢిల్లీ, 16 జనవరి 20 13: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కేసుకు ఇతర కేసులకు పోలిక లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సలహాదారు సోమయాజులు అన్నారు. శ్రీ జగన్‌పై కొందరు పనిగట్టుకుని భారీ అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ వైయస్ జగన్ కేసును 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసుతో కావాలనే పోలుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ కేసు విచారణలో కోర్టు ప్రమేయం లేదని, కేవలం కేసు పెట్టమని మాత్రం చెప్పిందని సోమయాజులు స్పష్టం చేశారు. శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో జనకోటి సంతకాల సిడిలను రాష్ట్రపతికి అందజేసేందుకు వచ్చిన బృందంలో ఉన్న సోమయాజులు బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు.
ఇదే సమావేశంలో కొందరు మీడియా ప్రతినిధులు.. శ్రీ జగన్ జైల్లో ఉన్నారని, బెయిల్ రాదంటూ పదే పదే ప్రశ్నలు సంధించారు. బెయిల్‌పై విలేకరులు వ్యక్తం చేసిన అనుమానాల్ని విజయమ్మ కొట్టివేస్తూ.. త్వరలోనే జగన్‌బాబు బయటిరి వస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందన్నారు. దేవుడు ఉన్నాడని తమకు న్యాయం లభిస్తుందని ఆమె అన్నారు.