ఇస్రో శాస్త్రవేత్తలకు విజయమ్మ అభినందన

హైదరాబాద్, 25 ఫిబ్రవరి 2013: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సోమవారంనాడు ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-20 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్ర రాజ్యాలకు దీటుగా ముందుకు దూసుకుపోతోందని చెప్పేందుకు పిఎస్‌ఎల్‌వి సి- 20 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడమే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పిఎస్‌ఎల్‌వి సి-20 ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ఇస్రో శాస్త్రవేత్తలను శ్రీమతి విజయమ్మ అభినందించారు. మన దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతంగా జరగాలని శ్రీమతి విజయమ్మ ఆకాంక్షించారు.
Back to Top