తొణికిన.. తణుకు

రుణ వంచనపై తిరగబడ్డ రైతన్న 
కదం తొక్కిన మహిళా లోకం
వెల్లువెత్తిన యువకులు, పార్టీ శ్రేణులు.. బాబు మోసాలపై నిప్పులు
రైతుదీక్ష విజయవంతం

తణుకు: రైతు రుణమాఫీపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు కోతలు వేస్తుండటంపై మండిపడుతున్న ప్రజలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి  చేపట్టిన రైతుదీక్షకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచే వేలాది మంది దీక్షా స్థలికి తరలివచ్చారు. భారీ సంఖ్యలో మహిళలు, రైతులు స్వచ్ఛందంగా దీక్షకు తరలిరావడంతో రైతు దీక్ష విజయవంతమైంది. సాయంత్రం వైఎస్ జగన్‌కు ఆ పార్టీ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిన సంఘీభావం ప్రకటించారు. అంచనాలకు మించి రైతులోకం, నారీజనం రైతు దీక్షకు తరలివచ్చారు. చంద్రబాబు రుణవంచనపై రైతన్న తిరగబడ్డాడు. నారా వారి నయా మోసంపై మహిళా లోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చెరిగింది. ఎడాపెడా పింఛన్ల కోతపై వృద్ధులు, వికలాంగులు కదం తొక్కారు. అధికారం దన్నుతో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడుతున్న వేధింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి.
Back to Top