మార్క్సిస్టు యోధుడు వైఆర్కే మృతికి సంతాపం

హైదరాబాద్, 20 అక్టోబర్ 2013:

మార్క్సిస్టు యోధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) మృతికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. క్రమశిక్షణ గల నాయకుడిగా ప్రజలలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న వైఆర్కే మరణం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని గట్టు విచారం వ్యక్తంచేశారు. వైఆర్కే కుటుంబ సభ్యులకు గట్టు సానుభూతిని వ్యక్తంచేశారు.

Back to Top