మోసం చంద్రబాబు నైజం

మోసం చంద్రబాబు నైజం

చంద్రబాబును మహిళలు నమ్మరు

పసుపు–కుంకుమ పెద్ద కుంభకోణం

వైయస్‌ జగన్‌ను సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

వైయస్‌ఆర్‌సీపీ నేత కిల్లి కృపారాణి...

హైదరాబాద్‌: ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని కిల్లి కృపారాణి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పసుపు–కుంకమ పథకం పెద్ద కుంభకోణంగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబు మోసాలను డ్వాక్రా మహిళలు గ్రహించాలని కోరారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు మహిళలకు అనేక హామీలిచ్చి మోసగించారన్నారు. బ్యాంకుల్లో కొదవ పెట్టుకున్న బంగారాన్ని.. మీ తలుపు తట్టి మీ చేతుల్లో పెడతానని చెప్పిన చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసగించారన్నారు. రుణమాఫీ చేస్తానని మహిళలను మభ్యపెట్టి వంచించారన్నారు. మహిళలందరూ ఓటు వేసి గెలిపిస్తే..నేడు చంద్రబాబు వారి ఉసురుపోసుకునే విధంగా నిలువునా ముంచాడని మండిపడ్డారు.

డ్వాక్రా మహిళలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పావలా వడ్డీకే రుణాలిచ్చారన్నారు. టీడీపీ పాలనలో డ్వాక్రా మహిళలకు  కనీసం వడ్డీ రాయితీ కూడా ఇవ్వలేదన్నారు. వడ్డీ రాయితీలో 200 కోట్ల రూపాయలు పక్కనపెట్టి..మీకు పెద్దన్నను అంటూ చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో మహిళలను మోసం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ సుజల సవ్రంతి పేరుతో ప్రతి డ్వాక్రా మహిళ..ఇంటి దగ్గర ట్యాప్‌ విపితే మంచినీరు వస్తుందని చంద్రబాబు చెప్పారని,నీటి బిందెలు పట్టుకుని దూరం వెళ్లనవసరం లేదని చెప్పిన చంద్రబాబు..మహిళలను దగా చేశారన్నారు.

గ్యాస్‌ సిలెండర్లపై 100 రూపాయలు సబ్సిడీ,బిడ్డలకు ట్యాబ్‌లు, ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ వరుకూ ఉచిత విద్యుత్, రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు  దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్‌ స్టౌలు, సిలెండర్లు అంటూ హామీలు ఇచ్చి చివరకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మళ్లీ నేడు పసుపు–కుంకుమ పేరుతో మహిళలను మళ్లీ మభ్యపెడుతున్నారన్నారు.మళ్లీ మహిళలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమర్థవంతుడైన నాయకుడని, అనేక సమస్యలను,సవాళ్ల స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.ౖ వెయస్‌ జగన్‌ నాయకత్వంలోనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top