'ప్రబుత్వ విదానాలు ఎండ గట్టేందుకే దీక్ష'

హైదరాబాద్: ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకే వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష తలపెట్టారని ఆ పార్టీ సీనియర నేత ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మాటతప్పిందని విమర్శించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రారుణాల రద్దు, రాజధాని నిర్మాణం పేరిట భూసేకరణ తదితర విషయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని ఎండగట్టేందుకు జగన్ రైతు దీక్షకు పూనుకున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజా వ్యతిరేక చర్యలు చేపడితే ఊరుకోమని చెప్పారు. ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తమపై ఉందని స్పష్టం చేశారు.
Back to Top