సమైక్య శంఖారావానికి వైయస్ఆర్‌టిఎఫ్‌ మద్దతు

హైదరాబాద్, 20 అక్టోబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు పార్టీ‌ అనుబంధ టీచర్ల ఫెడరేషన్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నెల 26న లాల్‌ బహదూర్‌ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేస్తామని ఎపివైయస్ఆర్‌ టీచర్సు ఫెడరేషన్‌ ఒక పత్రికా ప్రకటనలో స్పష్టంచేసింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎపివైయస్ఆర్‌ టిఎఫ్‌ వ్యతిరేకించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఉద్యమాలు, దీక్షలు, పోరాటాలు చేస్తున్న రాజకీయ పార్టీ ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రమే అని ఫెడరేషన్‌ నాయకులు పేర్కొన్నారు.

Back to Top