లండన్‌లో 12న యుకె వైయస్ఆర్‌సిపి ధర్నా

లండన్, 9 అక్టోబర్ 2013:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రె‌స్ ప్రభుత్వం‌ నిరంకుశంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ యు.కె. విభాగం ఈ నెల 12న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నది. ఆ రోజు (శనివారం) మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించేందుకు నగర మెట్రోపాలిటన్ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నామని శ్రీకాంత్ లింగాల, వైఎల్ఎ‌న్ రెడ్డి, రాజుల ‌ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యుకె, యూరప్‌లోని సమైక్యవాదులందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 70 రోజులకు పైగా సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ‌ దూకుడుగా ముందుకు వెళ్లడంపై ప్రవాసాంధ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ యుకె విభాగం నాయకులు తమ ప్రకటనలో తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజ‌లంతా సమైక్యంగా కష్టపడి కృషి చేసి రాష్ట్రా‌నికి, హైదరాబాద్ నగరానికి ప్రపంచ పటంలో గుర్తింపు లభించేలా చేశారని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆదాయంలో ‌50 శాతానికి పైగా హైదరాబాద్‌ నుంచే వస్తున్న సంగతిని వారు ప్రస్తావించారు. వాస్తవ పరిస్థితులను బేరిజు వేసుకోకుండా తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని పీఠం ఎక్కించడానికి సోనియా‌ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సిద్ధపడటంతో సీమాంధ్ర‌ మొత్తంగా జరుగుతున్న ఆందోళనలు, సమ్మె జరుగుతున్నాయన్నారు. దీనితో పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని ప్రవాసాంధ్రులు వ్యక్తం చేశారు.

మరింత సమాచారం కోసం 07540 222344, 07885971115, 07429 300528 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ యుకె విభాగం నాయకులు తెలిపారు.

Back to Top