9న వైయస్‌ఆర్‌ ట్రేడ్ యూనియన్ సమావేశం

హైదరాబాద‌్, 6 ‌సెప్టెంబర్‌ 2012 : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ట్రే‌డ్ యూనియ‌న్ ఆధ్వర్యంలో ఈ నెల 9న‌ (ఆదివారం) హెల్త్, మెడిక‌ల్, ఫ్యామిలీ వె‌ల్ఫేర్ ఉద్యోగుల సమావే‌శం నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనియన్‌ నిర్మాణం, కార్యాచరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల వేతన సవరణ, ఔట్‌సోర్సింగ్ విధానం రద్దుతో‌ పాటు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఈ సమావేశం జరుగుతుందని, దీనికి యూనియన్ ముఖ్యనేతలు తప్పనిసరిగా హాజరుకావాలని జనక్‌ప్రసాద్ కోరారు.

Back to Top