స్పీకర్ : బి.జనక్ ప్రసాద్ -ఫిబ్రవరి 8,2012

ఆంద్రప్రదేశ్ లో మద్యం సిండికేట్ బాండాగారం బద్దలైంది. మంత్రివర్గంలో ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణకు సాక్షాత్ మద్యం సిండికేట్ నడిపేటువంటి నున్న రమణ 10,00,000 రూపాయలు లంచంగా ఇచ్చినట్టు ఎ.సి.బి. ఎఫ్ఐఆర్  రిపోర్టులో తెలియజేయడం జరిగింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున మేము రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. లేదా ముఖ్యమంత్రి తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముక్యమంత్రిగారు నాది చాల పారదర్శకమైన ప్రభుత్వం అని చెప్తున్నాడు.ఇప్పటివరకు ఎ.సి.బి. రిపోర్ట్ ను ఎందుకు భాహిర్గతం చేయలేదు. కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం ఆయన మంత్రివర్గ సహచరులని లేదా రాజకీయ ప్రత్యర్థులని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడా? ఈ మద్యం సిండికేట్ లో కనీసం లెక్కల ప్రకారం సంవత్సరానికి 5,500 కోట్లు అదనంగా ఆదాయం పొందుతూ 1,600 కోట్లు చిన్న ఉద్యోగి దగ్గర నుంచి పెద్ద నాయకులు,మంత్రులకి కూడా పంపకం జరుగుతుంది. గతంలో మీ పత్రికలు ప్రకటించినట్లు ఈ మద్యం సిండికేట్ లో 8 మంది మంత్రులు, 40 మంది పైచిలుకు ఎం.ఎల్.ఎ.లు ఉన్నట్లు ప్రకటించారు. కేవలం మోపిదేవి వెంకటరమణ ఒక ఐస్ ముక్క మాత్రమే. ఈ సిండికేట్ ఇంకా చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తోటి విచారణ జరిపిచి నిజాలను నిగ్గుతెల్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 1800 గ్రామాల్లో కనీసం త్రాగడానికి నీళ్ళులేని పరీస్టితుల్లో బీరు ప్రవహింపచేసే విదంగా 17మద్యం తయారు చేసే కంపెనీలకు అదనపు ఉత్పతి చేయడం కోసం జి.ఓ.ఇవ్వడం  జరిగింది. ఈ విషయాలన్నింటిమీద విచారణ జరిపించినపుడే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇటీవల నీతిభాహ్యమైన ప్రకటనలు చేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల కార్మీకులు పోద్దస్తుమానం పనిచేసి సాయంత్రం తాగుదామంటే ఎక్కువ ధరకు దొరుకుతుందని చేపుతున్నాదంటే అది సిగ్గుమాలిన సలహా. ప్రభుత్వమేమో ఒక దిక్కు మద్యాన్ని అధికంగా ఉత్పతి చేసి, అధికంగా తాగించి శవాల మీద పేలాలు ఏరుకునే పరీస్తుతుల్లో ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రకటన చేయడం జరిగింది మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయటం, వాటిని నియంత్రించడం కోసం 10 మంది మహిళా కానిస్టేబుల్లను పెట్టి నియంత్రించడం జరుగుతుందని చెప్పారు. అదేవిదంగా సారా తయారు చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో కట్టడి చేస్తామని చెప్పారు. ఇటువంటి పరీస్తుతుల్లో ప్రజా సంక్షేమాన్ని కోరని ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

            (బి. జనక్ ప్రసాద్)
            అధికార ప్రతినిధి

 

Back to Top