17న వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్ భేటీ

హైదరాబాద్, 16 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఈ నెల 17 ఆదివారం సమావేశం అవుతోంది. అంగన్‌వాడి కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతున్నట్లు కార్మిక విభాగం అధ్యక్షుడు బి.జనక్‌ ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశానికి అనుబంధ యూనియన్లు హాజరు కావాలని ఆయన కోరారు.
Back to Top