బాబు కేబినెట్‌లో ముస్లింలకు చోటు లేదు


ఎమ్మెల్యే ముస్తాఫా
విశాఖ: చంద్రబాబు కేబినెట్‌లో ముస్లింలకు చోటు లేదని ఎమ్మెల్యే ముస్తాఫా విమర్శించారు. చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ లేదని, ఓట్ల కోసం దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు మైనారిటీల సదస్సులో ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తండ్రి మాదిరిగానే వైయస్‌ జగన్‌ కూడా రెండు అడుగులు ముందుకు వేస్తారని, మైనారిటీలకు పెద్ద పీట వేస్తారని చెప్పారు. 
 
Back to Top