తణుకు పట్టణంతో వైయస్‌ఆర్‌కు అవినాభావ సంబంధం


పశ్చిమ గోదావరి: తణుకు పట్టణంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి అవినాభావ సంబంధం ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేత  
వంకా రవీంద్రనాథ్‌  పేర్కొన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.తణుకు పట్టణంతో వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తన భార్య వంకా రాజేశ్వరి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంలో లోకల్‌ బాడీకి సరైన నిధులు లేవని మహానేతకు వివరించగానే వెంటనే ఓ జీవో విడుదల చేసి వంద శాతం యూఎండీసీ ప్రాజెక్టులు వచ్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఆ జీవోతో తణుకులో వాటర్‌ ప్రాజెక్టు వచ్చిందన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఏవిధంగా ఉందో ఆలోచించుకోవాలన్నారు. ఇసుక నుంచి మట్టి దాకా దోచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మనవాళ్లు అవసరం లేదట..ప్రతిదానికి సింగపూర్‌ పరుగులు తీస్తున్నారని విమర్శించారు. దోచుకోవడమే చంద్రబాబు,టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు మేలు చేసేందుకు చక్కటి ప్రణాళికతో వైయస్‌ జగన్‌ ముందుకు వస్తున్నారని, ప్రతి ఒక్కరూ అయన్ను దీవించి, ఆశీర్వదించాలని ఆయన కోరారు. 
 
Back to Top