ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలి

జాన్, సర్పంచ్‌
తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ జాన్‌ కోరారు.  మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మత్స్యకారులకు సంబంధించి ఇదివరకే నర్సాపురంలో హామీలు ఇచ్చారన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 2007లో ఉప్పాడ ప్రాంతానికి వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ.14 కోట్లతో రోడ్డు వేశారని, ఆ రోడ్డు శిథిలావస్థకు చేరిందన్నారు. కొత్త రొడ్డు నిర్మించాలని ఆయన కోరారు. 
 
Back to Top