విజయవంతంగా సాగుతున్న పాదయాత్ర

కర్నూలు: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుందని, పాదయాత్రకు రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు తండోప తండాలుగా తరలివస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను కలుసుకుని తమ బాధలు చెప్పుకునేందుకు ప్రజలంతా వస్తున్నారని చెప్పారు. జనం తాకిడి ఎక్కవ కావడంతో వైయస్‌ జగన్‌ వారి సమస్యలన్నీ తెలుసుకుంటూ వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నారన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, పొలాల్లో పనిచేసుకునే వారంతా పరిగెత్తుకుంటూ వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయన్నారు. 
Back to Top