పాదయాత్రలో వైయస్‌ జగన్‌ అందరి కష్టాలు చూస్తున్నారు


టి.శాంతరామ్‌
తూర్పు గోదావరి: పాదయాత్రలో వైయస్‌ జగన్‌ అందరి కష్టాలు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు శాంతరామ్‌ పేర్కొన్నారు. మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళంలో టీ,శాంతరామ్‌ మాట్లాడుతూ..చాలా మంది ముఖ్యమంత్రిని చూశానని, వైయస్‌ రాజశేఖరరెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదన్నారు. తండ్రి మాదిరిగానే వైయస్‌ జగన్‌ కూడా పేదలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. పాదయాత్రలో అందరి కష్టసుఖాలు వైయస్‌ జగన్‌ చూశారని, కచ్చితంగా మంచి చేస్తారన్నారు. మత్స్యకారులు చనిపోతే కేవలం రూ.2 లక్షలు రెండేళ్ల తరువాత ఇస్తున్నారని చెప్పారు. సముద్రంలో మిస్‌ అయిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన వైయస్‌ జగన్‌ను కోరారు. విరామ సమయంలో కనీసం రూ.5 వేలు  ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల పిల్లలకు ఉచిత విద్యనందించాలని కోరారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు. మత్స్యకారులకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై కృతజ్ఞతలు చెప్పారు.
 
Back to Top