వైయస్‌ జగన్‌ తండ్రిని మించిన తనయుడు


పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ తండ్రిని మించిన తనయుడుగా ఎదుగుతారని, వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేస్తారని ప్రసాదరాజు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు తాడేపల్లెగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక కుటుంబం ఒక్క వైయస్‌ఆర్‌దే అన్నారు. 2003లో వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారన్నారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు. మహానేత ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైయస్‌ షర్మిళ కూడా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారన్నారు. ఇవాళ వైయస్‌ జగన్‌ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారన్నారు. జగనన్న సీఎం కాగానే మన కష్టాలు తొలగిపోతాయన్నారు. 
 
Back to Top