మీరంటే ప్రాణమిచ్చే వారు ఎందరో ఉన్నారన్నా..


ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌
తూర్పు గోదావరి: జగనన్నా..మీరంటే ప్రాణమిచ్చే ప్రజలు ఇక్కడ ఉన్నారని ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరం మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. నియోజకర్గంలో బాలయోగిశ్వరులు తపస్సు చేసిన ప్రాంతమని, ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు రాజకీయ నాయకులుగా పని చేశారన్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు అధికంగా ఉన్నారన్నారు.అంబేద్కర్‌ను ప్రపంచమంతా మేధావిగా భావిస్తారన్నారు. కానీ మా నియోజకవర్గంలో ప్రజలు భగవంతుడిగా కొలుస్తారన్నారు. ఆత్మాభిమానం కలిగిన ప్రజలు ఇక్కడ ఉన్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, శెట్టి బలిజ కులస్తులకు అండగా నిలవాలని వైయస్‌ జగన్‌ను కోరారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు చూపించాలన్నారు. కాపులు చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. వారికి కూడా మంచి చేయాలని కోరారు. అందరూ ప్రేమించే కులం మత్స్యకారులదన్నారు. ఏ సామాజిక వర్గంలో కూడా విభేదాలు లేకుండా అందర్ని అన్నదమ్ముళ్ల కలుపుకొని పోయే క్షత్రియ కులస్తులదన్నారు. వేట లేక 15 వేల మంది వలసలు వెళ్లారని వివరించారు. వీరందరిని ఆదుకోవాలని కోరారు.  
Back to Top