బలహీన వర్గాలను ఆదుకుంది వైయస్‌ఆర్‌ ఒక్కరే


వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు  పార్థసారధి
తూర్పు గోదావరి: బలహీన వర్గాలను ఆదుకుంది  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు పార్థసారధి చెప్పారు. చంద్రబాబు బలహీన వర్గాలకు ఏం చేశారని ప్రశ్నించారు. తుని సభలో ఆయన మాట్లాడారు.  మత్స్యకారులను తోలు తీస్తానని, నాయీ బ్రహ్మణుల తోక కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరిస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేశారని చెప్పారు. రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. 
Back to Top