అన్ని స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీని గెలిపిద్దాం

పశ్చిమ గోదావరి: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీని గెలిపించుకుందామని వైయస్‌ఆర్‌సీపీ నేత ముదునూరు ప్రసాదరాజు అన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ప్రసాదరాజు మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ ఇడుపులపాయ నుంచి  ఇచ్చాపురం వరకు ఎండా, వానా లేక చేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ పాదయాత్రగా వస్తున్నారన్నారు. ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక కుటుంబం వైయస్‌ఆర్‌దే అన్నారు.నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నామన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీని గెలుపిద్దామని పిలుపునిచ్చారు.
 
Back to Top